సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు .. దానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. హీరో హీరోయిన్స్ కెరియర్ ఎలా మలుపు తిరుగుతూ ఉంటుందో మనకు తెలిసిందే . అయితే కొన్ని కొన్ని సార్లు భారీ బడ్జెట్ కేటాయించి తెరకెక్కించిన సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అవుతూ ఉంటాయి . అయితే పెట్టిన దానికి సగం కూడా రాకుండా ఉండే సినిమాలు ఉన్నాయి . కానీ పెట్టిన దానికి అసలు గిట్టుబాటు రాకుండా చేసిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి .
అయితే ఇప్పటివరకు సినీ చరిత్రలో పరమ డిజాస్టర్ మూవీ గా నిలిచింది మాత్రం “ద లేడీ కిల్లర్” అనే చెప్పాలి . తెలుగులో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి ..కాటమరాయుడు .. మహేష్ బాబు నటించిన స్పైడర్ అదే విధంగా చిరంజీవి నటించిన ఆచార్య ..ఇలా ఎన్నో ఎన్నో సినిమాలు బాగా డిజాస్టర్ గా మారాయి . అయితే బాలీవుడ్ లో తెరకెక్కిన .. లేడీ కిల్లర్ మాత్రం డిజాస్టర్ కే డిజాస్టర్ .
అర్జున్ కపూర్ నటించిన ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 45 కోట్లు ఖర్చుపెట్టారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయి కేవలం 70 వేలు మాత్రమే కలెక్షన్ సాధించడం ..చాలా చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంతకంటే డిజాస్టర్ మూవీ ఇంకొకటి లేకపోవడం గమనార్హం . అయితే ఈ సినిమాలో కధా.. కంటెంట్ పెద్దగా ఆకర్షణీయంగా లేకపోవడంతోనే ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటున్నారు జనాలు..!!