టాలీవుడ్ క్రేజీ హీరో అడవి శేష్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గూడచారి, హిట్ 2, ఎవరు, మేజర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్ ప్రస్తుతం గూఢాచారి 2, డెకాయిట్ సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీటిలో హీరోగా నటించడమే కాకుండా.. ఈ రెండు సినిమాలకు రైటర్ గా కూడా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక డెకాయిట్ సినిమాలో ఈ క్రేజీ హీరో సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. క్షణం, గూడాచారి సినిమాలకు సినిమా ఆటోగ్రాఫర్ గా చేసిన సన్ని డియోల్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో ప్రతి సీన్, డైలాగును హిందీతో పాటు తెలుగులోనూ మేకర్స చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా అడవి శేష్‌కి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడవి శేష్ తన అసలు పేరు అది కాదంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అడవి శేష్ మాట్లాడుతూ.. తన అసలు పేరు సన్నీ చంద్ర అంటూ చెప్పుకొచ్చాడు. అమెరికాలో ఉన్నప్పుడు నా పేరు చూసి అందరూ వెక్కిరించే వారిని.. అక్కడ ఆరంజ్ ఫ్లవర్ లో సన్నీ డిలీట్ అని జ్యూస్ ఉండేదని.. అలాగే అప్పట్లో సన్నిలియోన్ బాగా పాపులర్ అంటూ వివరించాడు.
నా పేరులో సన్నీ ఉండడంతో అందరూ బాగా టీజ్ చేసే వారిని.. ఇదే విషయం నాన్నకు చెప్పగా అయితే శేష్ అనే పేరు వాడుకో అని చెప్పినట్లు వివరించాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు.. సునీల్ గవాస్కర్ అభిమానిని కాబట్టి సన్నీ అని పెట్టా.. పూజారి శ అక్షరంతో పేరు ఉండాలని అన్నాడు. అలా నీకు శేష్ అనే పేరు కూడా ఉంది అంటూ చెప్పారని.. అప్పటి నుంచి నా పేరు అడవి శేష్ గా మారిందంటూ చెప్పుకోచాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ అవ్వడంతో.. అయితే శేష్ అసలు పేరు అది కాదా.. మొదట సన్నీ చంద్రా అనే పేరు ఉండేదా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.