ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్స్ తోనే వాళ్ళ బాధను దిగమింగుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు బన్నీని థియేటర్లో చూద్దామా మరొక నెల రోజులు ఉంది.. అంటూ బాగా ఈగర్ గా వెయిట్ చేస్తూ వచ్చారు ఫ్యాన్స్ . ఫైనల్లీ కోట్లాదిమంది అభిమానుల ఆశలపై నీళ్లు జల్లుతూ పుష్ప 2 టీం సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేసింది. పుష్ప2 సినిమా వాయిదా పడినట్లు అఫీషియల్ గా ప్రకటించింది . కారణాలు ఏవైనప్పటికీ పుష్ప 2 సినిమా వాయిదా పడడం ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చడం లేదు.
కొందరు మెగా ట్రోల్లింగ్ వల్ల ఈ సినిమా వాయిదా పడింది అంటుంటే మరికొందరు మాత్రం ఈ సినిమా వాయిదా పడడానికి మెయిన్ రీజన్ సినిమా షెడ్యూల్ సరిగ్గా ముందుకు వెళ్లకపోవడం.. అలాగే కొన్ని కొన్ని సీన్స్ రీ షూట్ చేయాల్సి వస్తూ ఉండడమే అంటూ బయటపడింది. తాజాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మరొక వార్త వైరల్ గా మారింది . మెగా ఫాన్స్ ఎవరైతే బన్నీని ట్రోల్ చేస్తున్నారు .
వాళ్ళకి గేమ్ ఛేంజర్ విషయంలో మనం బాగా గుణపాఠం చెప్పచ్చు అంటూ బన్నీ డై హార్ట్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారట. పుష్ప 2 సినిమా విషయంలో మనల్ని హర్ట్ చేయొచ్చు. గేమ్ చేంజర్ సినిమా విషయంలో రామ్ చరణ్ కి చుక్కలు చూపించాలి అంటూ డిసైడ్ అయ్యారట . గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే పుష్ప2 సినిమా రిలీజ్ అయి హిట్ కొడితే ఆ కిక్కే వేరు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో బన్నీను సపోర్ట్ చేస్తున్నారు. ఈ కామెంత్స్ బాగానే హిట్ పెంచేస్తున్నాయి..!!