సోషల్ మీడియాలో ప్రజెంట్ అల్లు అర్జున్ పై ఎలాంటి రేంజ్ ఆఫ్ ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిందే.. పాపం తన పాటికి తాను సినిమాలు చేసుకుంటూ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫ్యామిలీతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తన టైం బాగోలేదో కావాలనే వేరే వాళ్ళు పొలిటికల్ పరంగా ఇరికించాలి అని అనుకున్నారో తెలియదు.. కానీ వైసిపి కాండిడేట్ కి సపోర్ట్ చేసి అల్లు అర్జున్ తన సమస్యలను తానే కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చేసింది .
వైసిపి కాండిడేట్ కు సపోర్ట్ చేయడం పట్ల మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఎలా మండిపడ్డారో మనం చూసాం. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి గ్రాండ్గా వెల్కమ్ ఇచ్చిన పార్టీలో సైతం అల్లు అర్జున్ ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ దూరం పెట్టేసింది. దీంతో ఇక అల్లుకి మెగాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై పలువురు సామాన్య ప్రజలతో పాటు కమెడియన్స్ కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉండడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మండిస్తుంది .
అయితే ఇంత ట్రోలింగ్ జరుగుతున్న అల్లు అర్జున్ చాలా సైలెంట్ గా ఉన్నాడు .. ఎక్కడ ఏమి కూడా మాట్లాడట్లేదు. అసలు మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పై ట్రోలింగ్ చేయొద్దు అంటూ చెప్పడం లేదు.. దీంతో ఫాన్స్ కి కొత్త రకమైన డౌట్లు క్రియేట్ అయ్యాయి. కొంతమంది బన్నీ భయపడ్డాడు ..అంటుంటే మరి కొంతమంది అంత సీన్ లేదని అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు అని.. అందుకే ఇలాంటి చిల్లర వెధవ కామెంట్స్ పట్టించుకోవట్లేదు అంటూ బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!!