మూవీ ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలకృష్ణ నటించిన సినిమా ఏంటో తెలుసా.. కారణం ఇదే..?!

నందమూరి నట సార్వభౌమ తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. మొదటి నుంచి తండ్రితో కలిసి ప‌లు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన బాలయ్య.. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సమయంలో సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మగారి మనవడు సినిమాలో సోలో హీరోగా అవకాశం ద‌క్కించుకున్న‌బాలయ్య మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో హిట్ అందుకుని వరుస‌ ఆఫర్లను దక్కించుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు బాలయ్య తన కెరీర్ వెనక తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా దూసుకుపోతున్నాడు.

Tiragabadda Telugubidda Telugu Full Movie || Balakrishna, Bhanu Priya

ప్రస్తుతం ఆరు పదుల వయసు దాటుతున్నా.. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ భారీ కలెక్షన్లను రాబడుతున్న బాలయ్య.. ఇటీవల హ్యాట్రిక్ హిట్లతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా బాలయ్య.. ఆ సినిమాలో నటించాడంటూ దానికికి కారణం ఇదే అంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంతకీ బాలయ్య ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన నటించిన ఆ కథ ఏంటో.. ఆ సినిమా నటించడానికి గల కారణం ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం.

When Balakrishna differed with his legendary father | cinejosh.com

ఏ. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించిన మూవీ తిరగబడ్డ తెలుగు బిడ్డ. ఈ సినిమా 1988లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. తేజస్విని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందమూరి హరికృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కథ విన్న బాలకృష్ణ సినిమా కు ప్రేక్షకులు రారని.. సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పాడట. అయితే ఈ సినిమాలో మంచి సందేశం ఉండడంతో ఈ సినిమా వల్ల లాభాలు రాకపోయినా పర్వాలేదు.. సినిమా ప్రేక్షకుల వద్దకు వెళ్తే చాలు అని ఎన్టీఆర్.. బాలయ్యను సినిమాలో నటించమని వివరించాడట. దీంతో తండ్రి మాటను గౌరవించి బాల‌య్య ఫ్లాప్ అవుతుందని తెలిసిన తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో.. ఇది మా బాలయ్య మ‌న‌స్త‌త్వం.. తండ్రి పై ఆయ‌న‌కు ఉన్న గౌర‌వం.. ఆయ‌న ఎలాంటివాడు అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.