ఎంత పెద్ద స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా తమకంటూ ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉంటారు. వాళ్ల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో మన తెలుగు ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోస్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే విషయం వైరల్ గా మారింది. ఆశ్చర్యం ఏంటంటే చాలామంది టాప్ హీరోస్ కి ఒకరే ఫేవరెట్ హీరోయిన్ గా ఉన్నారు. ఆమె మరెవరో కాదు సావిత్రి .
ఎస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాజ్యమేలేసిన మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి అంటే అందరి హీరోలకి ఇష్టమే. మరి ముఖ్యంగా మన తెలుగు హీరోలను ఇంటర్వ్యూలలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించగానే.. మొట్టమొదటగా వాళ్ళ నోటి నుండి వచ్చే పేరు సావిత్రి. ప్రభాస్ – రామ్ చరణ్ – మహేష్ బాబు – తారక్ – బన్నీ ఇలా ఎంతమంది ఆమెను ఆరాధిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
సావిత్రి ఎంతో టాలెంటెడ్ ..సావిత్రి ఎంతో కష్టపడింది కూడా ..కానీ కెరియర్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ఆమె లైఫ్ నాశనం అయిపోయింది. ఇప్పటికి సావిత్రి నటించిన సినిమాలు మన ఇంట్లోని అమ్మమ్మలు తాతలు టీవీలో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ఒక్కసారి మనం ఆ సినిమాలు చూస్తే సావిత్రి గారి నటన ఏంటో ఆమె టాలెంట్ ఏంటో అర్థం అయిపోతుంది. అంతేకాదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లతో సావిత్రి స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీస్ బాగా హిట్ అయ్యాయి..!!