రష్మిక మందన్నా ని విజయ్ ముద్దుగా ఏమని పిలిస్తాడో తెలుసా..? ప్రేమ అంటే ఇదే..!!

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ .. ఓ స్టార్ హీరోయిన్.. పలు బడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న బ్యూటీ. కాగా ఈమెకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఒకటి క్రేజీ హీరోయిన్ కావడం.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉండడం.. మరొకటి నిరంతరం సోషల్ మీడియాలో ఆమె ఆక్టివ్ గా ఉండడం . ఎస్ ఈ మూడు ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ట్రెండ్ అవ్వడానికి కారణం .

రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ ల పేర్లు ఎలా మారుమ్రోగిపోతున్నాయో మనం చూస్తున్నాం . వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అని.. పెళ్లి చేసుకోబోతున్నారు అని తెగ తెగ ప్రచారం జరుగుతుంది . అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు ఈ జంట . కానీ రీసెంట్గా ఆనంద్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ కోసం పాల్గొన్న రష్మిక మందన్నా.. పొరపాటున టంగ్ స్లిప్ అవుతూ ..”అరె మనం మనం ఒక ఫ్యామిలీ రా అంటుంది “..అప్పుడే జనాలు ఓ రేంజ్ లో అరుపులు అరిచేస్తారు.

దీన్నిబట్టి రష్మిక విజయ్ లు నిజంగానే ప్రేమించుకుంటున్నారు అని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇదే క్రమంలో ముద్దుగా ఆమెను విజయ్ ఏమని పిలుస్తాడు అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది . కాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది . ఈ న్యూస్ ప్రకారం రష్మిక మందన్నాని విజయ్ దేవరకొండ ముద్దుగా రషి అని పిలుస్తాడట . ఫోన్లో కూడా అదే విధంగా నెంబర్ సేవ్ చేసుకున్నారట. రష్మిక కి విజయ్ ఆలా పిలిస్తే చాలా చాలా ఇష్టమట . అంతేకాదు రషి అని విజయ్ దేవరకొండ తప్పిస్తే మరి ఎవరు రష్మిక మందన్నాను పిలవరట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!