లాస్ట్ మినిట్ లో మరో ట్వీస్ట్ ఇచ్చిన నాగ్ అశ్వీన్.. కల్కి నుంచి మరో బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్..!!

నాగ్ అశ్వీన్.. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్. మహానటి సినిమాతో ఏ రేంజ్ లో తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడో మనకు తెలుసు . కాగా ఆయన దగ్గర నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి . ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జూన్ 27వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఒక్కొక్క క్రేజీ అప్డేట్ ను రివిల్ చేస్తూ వస్తున్నాడు నాగ్ అశ్వీన్.

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కల్కి సినిమాలో భారీ క్యాస్ట్ అండ్ క్రూ ఉంటుందట . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాగూర్ అదేవిధంగా సీనియర్ హీరోయిన్ శోభన కూడా ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట . అంతేకాదు మరి కొంతమందిని కూడా ఈ సినిమాలో యాడ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా పబ్లిసిటీ చేసుకోవడానికి మాట్లాడుతున్నారా..?

లేకపోతే నిజంగానే సినిమాలో అలాంటి పాత్రలను పెట్టారో తెలియదు కానీ.. సినిమాకి మాత్రం ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాని – విజయ్ దేవరకొండ – దుల్కర్ సల్మాన్- రానా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పుడు మృణాల్.. నటి శోభన పేర్లు కూడా ఆడ్ అయ్యాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది స్టార్స్ ఈ సినిమాలో కనిపిస్తారో.. చూద్దాం . ఈ సినిమాపై అయితే మాత్రం రెబల్ ఫాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు..!!