“అలాంటి మగాళ్లు పనికిమాలిన పని చేసిన బాగుంటుంది”..హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

మన టైం బాగోలేకపోతే ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు . బహుశా బాలకృష్ణ టైం అసలు బాగోలేనట్టు ఉంది . అందుకే ఆయనకు సంబంధించిన ఇష్యూ ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. మనకు తెలిసిందే.. నందమూరి నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్యకు సంబంధించిన ఒక వీడియో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది . గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న బాలయ్య హీరోయిన్ అంజలితో ప్రవర్తించిన తీరు ఆయనను సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యేలా చేసింది .

తాకరానిచోట తాకడం .. అదేవిధంగా స్టేజిపై నెట్టి వేయడం ..బాగా ట్రెండ్ అయింది . ఈ ఇష్యూ పై చాలా మంది ఆయనపై మండిపడ్డారు. అయితే తాజాగా హీరోయిన్ రిధి డోగ్రా.. బాలయ్య ఇష్యూ పై స్పందించింది . బాలయ్య వీడియోని షేర్ చేస్తూ..సంచలన కామెంత్స్ చేసింది. ” అతను ఆ మహిళను కించపరిచే విధంగా వ్యవహరించినప్పటికీ ఆమె మాత్రం నవ్వుతుంది.. ఎందుకంటే బాగా డబ్బు – పేరు -పలుకుబడి ఉన్నాయి కదా ..

పేరున్న మగాళ్లు పనికిమాలిన పని చేసిన సరే ఈ ప్రపంచం తప్పు పట్టదు . సమాజంలోని జనాలు అలాంటి పురుషులు ఏం చేసినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చేసారు ఏం చేద్దాం? ఒకవేళ అదే సమయంలో అంజలి కొంచెం కఠినంగా ప్రవర్తించి ఉంటే ఇప్పటికే ఆయన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అయితే నందమూరి ఫ్యాన్స్ ఈ హీరోయిన్ నే ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం..!!