అభిమానం అనేది కొన్నిసార్లు హద్దులు మీరీ పోతూ ఉంటుంది . ఎలా అంటే ఒక హీరోయిన్ ఏదైనా ఈవెంట్ కోసం బయటకు వచ్చిన .. ఏదైనా షాప్ ఓపెనింగ్ చేయడానికి అక్కడికి వెళ్లిన కుర్రాళ్ళు ఓ రేంజ్ లో రెచ్చిపోతూ ఉంటారు. ఎంతలా అంటే ఆమె ఒక హీరోయిన్ అన్న విషయం పక్కన పెట్టండి.. ఒక అమ్మాయి అన్న విషయం గా కూడా గుర్తించరు. ఎక్కడపడితే అక్కడ నలిపేస్తూ తాకరాన్ని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ప్రజెంట్ అలాంటి సిచువేషన్ కి గురైంది మలయాళీ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు. మమతా బైజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రేమలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా రాజమౌళి సైతం ఆమె నటన ను ఓ రేంజ్ లో పొగడడంతో తెలుగులో సైతం మంచి మంచి అవకాశాలు అందుకునేలా చేస్తుంది. ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండ – ఎన్టీఆర్ లతో నటిస్తున్నట్లు టాక్ వైరల్ గా మారింది .
రీసెంట్గా షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కు హాజరైన మమిత బైజును అక్కడి కుర్రాళ్ళు తెగ ఇబ్బంది పెట్టేశారు. ఆమెను సాండ్విచ్ల నలిపేస్తూ తాకరానిచోట తాకుతూ.. నలుపుతూ.. పిండుతూ ఓ రేంజ్ లో టార్చర్ కి గురి చేశారు . దీనితో అసహనం వ్యక్తం చేసింది మమిత బైజు . దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇలా ఎందుకు చేస్తారో ఈ అభిమానులు అంటూ మండిపడిపోతున్నారు జనాలు. కొందరు మాత్రం కుర్రాళ్ళు ఇలా చేయడం తప్పు అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు..!!