అప్పుడు బాహుబలి కోసం ..ఇప్పుడు కల్కి కోసం.. ప్రభాస్ ఆ పనే చేస్తున్నాడుగా..!

ప్రభాస్ కి సంబంధించిన ఏ వార్త అయినా సరే సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా కల్కి ప్రమోషన్స్ కోసం ప్రభాస్ కూడా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ వస్తూ ఉండడం అభిమానులకి ఆశ్చర్యకరంగా మారింది . కాగా మరి కొద్ది గంటల్లోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో కల్కి సినిమా సంబంధించిన ఈవెంట్ జరగబోతుంది . భారీ ఎత్తున ఇప్పటికే సెటప్ అంతా రెడీ చేసేసారు .

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతూ ఉండడం ఇక్కడ సినిమాకే ప్లస్ పాయింట్. తొలిసారి దీపికా పదుకొనే సౌత్ టీం తో కలిసి వర్క్ చేయడం కూడా ఈ సినిమాకు హైలైట్ గా మారింది . కాగా ఈ సినిమా విషయంలో బాహుబలి సినిమా సెంటిమెంట్ ని రిపీట్ చేశాడు ప్రభాస్ అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . బాహుబలి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లోనే నిర్వహించారు . ఇప్పుడు కల్కి సంబంధించిన స్పెషల్ ఈవెంట్ అది కూడా మొదటి ఈవెంట్ ను రామోజీ ఫిలిం సిటీ లోనే నిర్వహిస్తున్నారు.

ఈ హిట్ సెంటిమెంట్ రిపీట్ అయితే కల్కి సినిమా కూడా బాహుబలి లాగే పెద్ద హిట్ అవుతుంది అని చరిత్ర తిరగరాస్తుంది అంటున్నారు జనాలు . అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా..? కావాలనే పక్కా ప్లాన్ తో చేశారో తెలియనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ ని బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో కల్కి స్పెషల్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది .. ఈవెంట్ కి బడా బడా ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది..!!