అబ్బబ్బా..కాజల్ ఎంత లక్కినో.. ఏకంగా ఆమె కోసం బాలయ్యనే అలా చేస్తున్నాడుగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. నందమూరి బాలకృష్ణది ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్న మనసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పక్క హీరోలకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా టాలెంట్ నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళని తనదైన స్టైల్ లో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయడం బాలయ్య స్పెషాలిటీ . తాజాగా హీరోయిన్ కాజల్ విషయంలో అదే చేయబోతున్నాడు . ఆమె ఎంతో కష్టపడి నటించినా సత్యభామ సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య రాబోతున్నాడు . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది .

సత్యభామ చిత్ర ట్రైలర్ విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్ . మే 24వ తేదీ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు అఫీషియల్ గా తెలియజేశారు . కాగా మే 24వ తేదీ సాయంత్రం 6:30 కు హైదరాబాద్లోని ఐటిసి కోహేనూర్ లో నిర్వహించబోతున్నట్లు చిత్త బృందం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. నందమూరి హీరో బాలయ్య ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారట . దీనిపై అఫీషియల్ ప్రకటన చేసింది చిత్ర బృందం .

ఆల్రెడీ కాజల్ బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది . వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే బాలయ్య ఈ విధంగా కాజల్ కి సపోర్ట్ చేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది . క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది . ఈ సినిమాతో భారీ హిట్ కొట్టబోతుంది కాజల్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!