కాజల్ అగర్వాల్ దృష్టిలో టాప్ నెం 1 హీరో ఎవరో తెలుసా.. భలే కరెక్ట్ గా రేటింగ్ ఇచ్చిందే..!

కాజల్ అగర్వాల్.. నమ్మితే ఎలాంటి పనైనా చేస్తుంది. సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తుంది. లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ బ్యూటీగా మారిపోయింది. కెరియర్ పిక్స్ లో ఉండగానే సినిమాలలో నటిస్తూ ఉండగానే గౌతమ్ కిచులు ని పెళ్లి చేసుకుంది . అంతేనా సడన్గా ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చేసింది. బిడ్డకు జన్మనిచ్చాక బాడీ రూపురేఖలు మొత్తం మారిపోయాయి. కానీ సినిమా ఇండస్ట్రీలోకి మళ్లీ హీరోయిన్గా రావాలి అన్న ఉద్దేశంతో కాజల్ అగర్వాల్ చాలా కష్టపడి మునుపటి బాడీ ఫిజిక్ ను తెచ్చుకుంది .

కాగా రీసెంట్గా ఆమె చేస్తున్న సినిమా సత్యభామ .. మే 30వ తేదీ సినిమా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. తాజాగా ఆమె తెలుగు హీరోలకి రేటింగ్ ఇచ్చింది. ఎవరు టాప్ అంటూ తన ఇంటర్వ్యూలో బయట పెట్టేసింది కాజల్ అగర్వాల్ . ప్రభాస్ – మహేష్ బాబు – ఎన్టీఆర్ – చిరంజీవి – బన్నీ – రామ్ చరణ్ – కళ్యాణ్ రామ్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా కాజల్ ఏ హీరోకి ఎన్ని మార్కులు ఇచ్చింది అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది . లుక్స్ పరంగా ప్రభాస్ కి ఎక్కువ మార్కులు ఇచ్చిన కాజల్ పదికి 8 రేటింగ్ ఇస్తే రాంచరణ్ రామ్ లకు ఏడు రేటింగ్ ఇచ్చింది . అంతేకాదు ఎన్టీఆర్ అల్లు అర్జున్ లకు ఆరు రేటింగ్ ఇచ్చింది . ఇక అందరికన్నా తక్కువగా కళ్యాణ్ రామ్ కి కేవలం ఐదు మార్కులు వేసింది . లుక్స్ పరంగా ప్రభాస్ చాలా బాగుంటాడు అని అందుకే ఎనిమిది మార్కులు ఇచ్చానని కూడా చెప్పుకొచ్చింది .

అయితే తనకు కెమిస్ట్రీ విషయంలో బాగా నచ్చిన హీరోస్ మాత్రం ఎన్టీఆర్ – ప్రభాస్ – రామ్ చరణ్ అంటూ తెగేసి చెప్పేసింది . పరోక్షంగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ప్రభాస్ అంటూ చెప్పకనే చెప్పేసింది.. కాజల్ అన్న విషయం ఇప్పుడు ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఎక్కడా కూడా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ల పేర్లు ఆమె ప్రస్తావించకపోవడం వాళ్ల ఫాన్స్ ను హార్ట్ చేస్తుంది..!!