వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి రాజకీయంగా కొత్త కష్టాలు మొదలయ్యాయి. రజనీ గత ప్రభుత్వంలో అటు ఎమ్మెల్యేగాను… ఇటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఓ రేంజ్‌లో హవా చెలాయించారు. వైసీపీలో ఎంతోమంది సీనియర్లకు రానీ లక్ ఆమెకు వచ్చింది. ఎమ్మెల్యే అయిన తొలి టర్మ్‌లోనే ఏకంగా మంత్రి అయిపోయారు. గత ఎన్నికలకు ముందు నుంచే రజనీకి రాజకీయంగా వైసీపీలో కష్టాలు మొదలయ్యాయి. ఆమెను బలవంతంగా చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు మార్చేశారు. ఇప్పుడు జగన్ ఇచ్చిన షాక్‌తో రజనీ రాజకీయం ముందు నుయ్యి.. వెనక గొయ్యి చందంగా మారిందా ? దీని వెనక ఏం జరుగుతోందో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ లింక్ క్లిక్ చేసి వినండి.

