సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో డ్రగ్స్ వ్యవహారాలు తెగ చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ సైతం చిక్కుకున్నారు. హీరోలు, హీరోయిన్స్ తో పాటు.. దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే.. తాజాగా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కామన్ అంటూ ఓ మహిళా ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ నెటింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. షూటింగ్ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం కామన్ అయిపోయిందని.. దానికోసం ప్రత్యేక బడ్జెట్, స్పెషల్ రూమ్స్ కూడా కేటాయించమని చెబుతున్నారని ఆమె చేసిన కామెంట్స్.. హాట్ టాపిక్ గా మారాయి.
ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా డ్రగ్స్ వాడకం గురించి.. మలయాళ ఇండస్ట్రీలోనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా.. డ్రగ్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది కూడా మలయాళ ప్రొడ్యూసర్ కావడం విశేషం. మలయాళ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం చాలా కామన్ అని.. నిర్మాత, నటి సాండ్రా థామస్ సంచలన ఆరోపణలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో సినీ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం కామన్ అయిపోయిందని.. దానికోసం ప్రత్యేక బడ్జెట్లు కేటాయిస్తారు. గదులు కూడా కేటాయిస్తున్నారు అంటూ వెల్లడించింది.
ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా మరింత తీవ్రమైందని.. సినీ సంఘాలు ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాయి అంటూ ఆమె సంచలన కామెంట్లు చేసింది. ఇక ఈ సమస్య గురించి అందరికీ తెలుసు. కానీ.. ఎవ్వరు ఏ చర్యలు తీసుకోవడం లేదు. డ్రగ్స్ వాడడంలో వుమెన్, మెన్, అన్ని రేంజ్ ల వాళ్ళ లోను కనిపిస్తూనే ఉంది అంటూ వివరించింది. ఈ సమస్యను అరికట్టడానికి సినీ సంఘాలు గట్టి చర్యలు తీసుకోవాలంటు పేర్కొన్న సాండ్రా.. సెట్లో మహిళా నిర్మాతలను ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలలో చేర్చాలని ఆమె వివరించింది. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై ఇంకా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు.. తెగ వైరల్ గా మారుతున్నాయి.