ఈ పై ఫోటోలో ఆర్మీ జవాన్ తో కలిసి క్యూట్ నవ్వుతో ఆకట్టుకుంటున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా. ఈ అమ్మడు ప్రెసెంట్ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. తెలుగుతో పాటు.. తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ రాణిస్తుంది. తెలుగులో మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ, రామ్ పోతినేని, రవితేజ, గోపీచంద్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మంచి క్రేజ్దక్కించుకుంది. అక్కడ కూడా అజయ్ దేవగణ్, ఆయుష్మాన్ ఖురానా తదితర స్టార్ హీరోల సినిమాలో నటించి మెప్పించింది.
కాగా కెరీర్ మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న క్రమంలో.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాతను ప్రేమించే వివాహం చేసుకుంది. అయితే పెళ్లైనా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గెస్ చేసారా.. సర్లెండి మేమే చెప్పేస్తాం. తను ఎవరోకాదు రకుల్ ప్రీత్ సింగ్. ఇక టాలీవుడ్ సినిమాలకు దూరమైనా.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన తండ్రి గురించి చెబుతూ రకుల్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకుంది.
సాయుద్ధ దళాల దినోత్సవం అంతర్జాతీయంగా ఉండవచ్చు కానీ.. నా మనసు మాత్రం మా నాన్న యూనిఫామ్ కోసం కొట్టుకుంటుంది. ఒక ఆర్మీ ఆఫీసర్ తల్లిదండ్రుల సమక్షంలో పెరగడం అంటే.. త్యాగం, గౌరవం, బాధ్యతలను ముందుగానే తెలుసుకోవడం అంటూ రాసుకొచ్చింది. ఈరోజు నేను మా నాన్నను మాత్రమే కాదు.. భారతదేశంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా తమకంటే దేశసేవ ఏ ముఖ్యమని భావించే ఆర్మీను ఎంచుకుని.. ప్రతి సైనికుని గౌరవిస్తున్నా. ఇటీవల కాలంలో మన భారత సైన్యం ధైర్యం, శాంతి ఉచితం కాదని మనకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆర్మీ జవాన్ కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ పేర్కొంది. ప్రస్తుతం రకుల్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.