ఆ రాత్రి నా లైఫ్‌నే మార్చేసింది.. చిన్న పాపని అలా చూసి భరించలేకపోయా.. నాని

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటుడిగా, ప్రొడ్యూసర్‌గా సత్తా చాటుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ గా కోర్ట్‌ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్న నాని.. హీరోగా సినిమాల పరంగాను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. దసరాతో మొదలైన సక్సెస్ ట్రాక్.. హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3తో ఇప్పటికీ అదే ఫామ్ లో రాణిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన హిట్ 3 థియేటర్స్ లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక సినిమాల్లో నాని మాస్ అవతారంలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హిట్ 3 సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు.

అయితే తన లైఫ్ లో జరిగిన ఓ రోడ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. నేను కారు కొనడానికంటే ముందు నాకు ఒక రోడ్డు ప్రమాదం జరిగిందని.. ఓ రోజు నా ఫ్రెండ్ కార్ తీసుకొని అందరం కలిసి హైవేపై డ్రైవ్ కి వెళ్దాం. రోడ్డుపై ఆగి ఉన్న లారీని మా కారు గుద్దేసింది. నైట్ టైం కావడంతో చీకట్లో అసలు ఏం కనిపించలేదు. లారీ ఉందని తెలుసుకునే లోపే యాక్సిడెంట్ జరిగిపోయింది. లారీ వెనుక భాగం మా కారులోకి వచ్చేసింది. దెబ్బకి ముందున్న గ్లాస్ బద్దలైపోయి.. ఒళ్లంతా గుచ్చుకుంది. నా బాడీ మొత్తం రక్తం, నా పక్క సీట్లో నా ఫ్రెండ్ స్పృహ తప్పిపోయి ఉన్నాడు. చివరికి ఏదోలా కారు నుంచి బయటపడ్డాం. అంబులెన్స్‌లో హాస్పటల్‌కు తీసుకువెళ్లారు అంటూ చెప్పుకొచ్చాడు.

మేము వెళ్లే దారిలో మరో పెద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనానికి యాక్సిడెంట్ జరిగింది. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఓ చిన్న పాప ఉంది. వాళ్లను కూడా మా అంబులెన్స్‌లోనే ఉంచారు. ఆ చిన్న పాపను అలా చూసి అసలు భరించలేకపోయా. నాకు జరిగిన ప్రమాదం మర్చిపోయి.. ఆ పాప‌ను ఐసీ లో ఉంచారు.. తనకు ఎలా ఉందో అని ఉదయం వరకు ఆ పాప రూమ్ బయట నిలిచి ఉండిపోయా.. ఆ రాత్రి నా లైఫ్‌ను పూర్తిగా చేంజ్ చేసేసింది అంటూ వివ‌రించాడు. ఆ ప్రమాదం తర్వాత నేను లైఫ్ లో చూసే విధానమే మారిపోయిందని.. ఈ భూమిపై ఉండే ప్రతి క్షణం మనకు వరం లాంటిదని.. ఎవరీ సింగల్ వినేట్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయ్యాల‌ని అర్థమైందంటూ నాని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.