ఇండస్ట్రీలో గతంలో సినిమా నుంచి స్పెషల్ సాంగ్ వస్తుందంటే దానికి సపరేట్ మోడల్స్.. సెలబ్రిటీస్ ఉండేవారు. కాదంటే విదేశాల నుంచి కొత్త మోడల్లను తీసుకువచ్చి మరి సినిమా స్పెషల్ సాంగ్స్ లో నటింపజేసేవారు. ఆడియన్స్‌ను మెప్పించేవారు. కారణం.. గతంలో హీరోయిన్స్ ఇలాంటి స్పెషల్ సాంగ్ నటించేందుకు రిజెక్ట్ చేసేవారు. కానీ.. ప్రస్తుతం పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు సైతం క్రేజ్ తగ్గుతున్న క్రమంలో పాపులారిటి దక్కించుకునేందుకు స్పెషల్ సాంగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సందడి చేస్తున్నారు. మరి కొంతమంది స్టార్ ఇమేజ్ కొనసాగిస్తున్నా.. ఇలాంటి స్పెషల్ సాంగ్స్ లో నటించి షాక్ ఇస్తున్నారు.
అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఒకటి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ అమ్మడు.. తాజాగా భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పుష్ప 2లో స్పెషల్ సాంగ్‌లో సైతం మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకున్న శ్రీ లీల మరో పక్క హీరోయిన్ గాను రాణిస్తుంది. ఇప్పటికే అమ్మడి డ్యాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే భారీ ఫాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న అమ్ముడు బాలీవుడ్‌లో సైతం అవకాశాలు దక్కించుకుంటుంది. అంతేకాదు.. తాజాగా ఈ అమ్మడు ఓ పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకుందని క్రేజీ రూమర్ వైరల్ గా మారుతుంది.
ఇంతకీ ఆ పాన్ స్టార్ హీరో ఎవరు కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ నటించిన పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఈ అమ్మడు చరణ్‌తో రొమాన్స్ చేయబోతుందని టాక్ నడుస్తుంది. బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో రూపొందుతున్నాయి సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది. కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్‌తో పాటు.. జగపతిబాబు తదితరులు ఇందులో కీలక పాత్రలో మెప్పించనున్నారు. ఇలాంటి క్రమంలో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బుచ్చిబాబు.. శ్రీలీలని సెలెక్ట్ చేసుకున్నారని.. ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్.. మాస్ పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేలా ఈ సాంగ్ డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే వాస్తవం అయితే ఫుల్ పండగే అనడంలో సందేహం లేదు.