సినీ ఇండస్ట్రీలో నటుడు సత్యరాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. తర్వాత వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ.. తన నటనతో మెప్పించాడు. తెలుగుతో పాటు.. తమిళ్లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో తన అద్భుత నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. టాలీవుడ్లో శంఖం, మిర్చి, ప్రతిరోజు పండుగ లాంటి ఎన్నో సినిమాల్లో ఆయన మెప్పించాడు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్లకు తండ్రి, తాతయ్య పాత్రలోనూ నటించాడు. అయితే సత్యరాజ్ అంటే మాత్రం ముందు గుర్తొచ్చేది కట్టప్ప రోలే. ఇక నటనల్లో ఈ రేంజ్ సక్సెస్ అందుకున్న కట్టప్ప ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. ఆయన కూతురు న్యూట్రిషన్.. అలాగే పొలిటిషన్ గానూ రాణిస్తుంది. మరోవైపు ఆయన తనయుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే సత్యరాజ్ కొడుకు ఎవరనేది చాలామందికి తెలియదు. అతనే సిబిరాజ్. ప్రస్తుతం తమిళ్లో హీరోగా దూసుకుపోతున్న ఆయన చెన్నైలో గ్రాడ్యుయేషన్‌ను కంప్లీట్ చేశాడు.
తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2003లో స్టూడెంట్ నెంబర్ 1తో ఇండస్ట్రీలో హీరోగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. తర్వాత జోర్, జాక్సన్ దోరై, మన్నిన్ మైందన్, వెట్రివేల్ శక్తివెల్, కోవై బ్రదర్స్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. తమిళ్లో వైవిధ్యమైన కంటెంట్ ఎంచుకుంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సిబి రాజ్.. చెన్నైలోనే ఓ ఐటి కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రేవతిని వివాహం చేసుకున్నాడు. ఇక ఈ జంటకు ఒక పాప, బాబు కూడా ఉన్నారు. ఇక సిబిరాజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు.