సమంత ప్లానింగ్ అదుర్స్.. ఈ ఏడది చివర్లోనే ఆ మూవీ కూడా..!

స్టార్ హీరోయిన్ సమంత దాదాపు దశాబ్ద కాలంపాటు.. టాలీవుడ్‌ను షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ అవకాశాలు అందించుకున్న.. ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లలో నటించినా.. అప్పటివరకు హీరోయిన్గా మాత్రమే కనిపించిన సామ్.. ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ వెరైటీ రోల్‌లో అందరికీ షాక్ ఇచ్చింది. సమంతలో ఈ టాలెంట్ చూసి.. బాలీవుడ్‌ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ మెన్ మేకర్స్‌తోనే.. సెటాడెల్ సిరీస్ సైతం నటించి మెప్పించింది. ఇక.. తాజాగా ప్రొడ్యూసర్‌గా మారి ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్ బ్యానర్ పై మొదటి సినిమా శుభం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సమంత.. నిర్మాతగా లాభాలు అందుకుంది. అయితే.. సమంత తన బ్యానర్‌లో మొదట అనౌన్స్ చేసిన మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తుపాకీ పట్టుకుని ఉన్న పోస్టర్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే.. ఈ సినిమా నుంచి తర్వాత ఏ చిన్న‌ అప్డేట్ కూడా రాలేదు. సడన్గా ఏమైందో కానీ.. శుభం అంటూ.. సరికొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేసి.. నిర్మాతగా పర్లేదు అనిపించింది. ఈ సినిమాకు గ్రాండ్ లెవెల్‌లో ప్రమోట్ చేసి.. ఎలాగో సక్సెస్ కొట్టేసింది. కాగా.. ఇప్పుడు తన బ్యానర్ పై మొదట అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం సినిమాను కూడా త్వరలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుందట.

LittleTalks | Maa Inti #Bangaram 🔥 #Samantha's next announced on the  occasion of her birthday. Produced by Tralala Moving Pictures, Actress  Samantha's... | Instagram

ఇప్పటికే సినిమా షూట్ పూర్తి కావచ్చిందని.. త్వరలోనే సినిమాపై అప్డేట్స్ ఇస్తానని ఆమె వెల్లడించింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం సమంత ఈ ఏడాదిలోనే మా ఇంటి బంగారం సినిమాను సైతం రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తుందట. అన్నీ కుదిరితే.. ఈ ఇయర్ డిసెంబర్‌లో సినిమా రిలీజ్ చేయనుందని టాక్. ఇక.. నిర్మాతగా మారీ.. ఒకే ఇయర్‌లో రెండు సినిమాలను రిలీజ్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక.. రెండో సినిమాతో సైతం సామ్‌ బ్లాక్ బస్టర్ కొట్టిందంటే నిర్మాతగా సమంతకు తిరుగులేని ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి క్రమంలో సమంత నిర్మాతగానే కాకుండా.. వేరే తెలుగు సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. స్టార్ సినిమాలకు పూర్తిగా దూరమవుతున్న ఈ అమ్మడు.. మళ్లీ కమర్షియల్ సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులంతా ఆశపడుతున్నారు. మరి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో.. సమంత ఎప్పుడూ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వేచి చూడాలి.