నాగార్జునకు పవన్ బిగ్ షాక్.. దెబ్బకి మైండ్ బ్లాక్ అయిందిగా.. !

టాలీవుడ్ కింగ్ నాగార్జున, పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి సంబంధించిన షాకింగ్ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. పవన్.. నాగార్జునకు బిగ్ షాక్ ఇచ్చాడంటూ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో.. పవన్ కళ్యాణ్ ఇచ్చిన షాక్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల లైఫ్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేరు.

Badri (2000) - IMDb

ఇక సినీ ఇండస్ట్రీలో దర్శకుడు హీరో కోసం కాదని రాసుకోవడం అది రకరకాల కారణాలతో వేరే హీరోలతో రూపొందించి స‌క్స‌స్ అందుకోవడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోస్ మాత్రం తమకు కథ వర్కౌట్ కాదని రిజెక్ట్ చేసి.. వేరే హీరో ఆ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టినా.. తెగ బాధపడిపోతూ ఉంటారు. ఆ లిస్టులోకే నాగార్జున వ‌స్తాడ‌ని టాక్‌. అలా నాగార్జున కూడా తన సినీ కెరీర్‌లో పరిస్థితులు కారణంగా కొన్ని క‌థ‌లు వదులుకోవాల్సి వచ్చింది. అలా.. ఆయన వదులుకున్న సినిమా బద్రి. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో పవన్ హీరోగా.. రేణు దేశాయ్ హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ అందుకుందో.. అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.

Step Inside the Grandeur of Akkineni Nagarjuna's House

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ పవన్ కెరీర్‌ని యూ టర్న్ తిప్పింది అనడంలో సందేహం లేదు. అయితే పూరీ జగన్నాథ్ మొదట ఈ కథను అతను నాగార్జునతో చేయాలని భావించారట. ఆ టైంలో నాగార్జునకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. ఈ క్రమంలోనే నాటి పాత్రలో నాగార్జున అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటాడని పూరి భావించాడట. కానీ.. వేరే సినిమాల స్కెడ్యూల్‌తో బిజీగా ఉన్న నాగ్ ఈ సినిమాను వదులుకున్నాడు. తర్వాత ట్రాక్‌లోకి వచ్చిన పవన్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే ఈ సినిమా హిట్ మూమెంట్లో నాగార్జున ఎంతగానో బాధ పడిపోయాడట. నేనే ఈ సినిమాలో నటించి ఉంటే ఎంతో బాగుండేదని ఎన్నోసార్లు భావించాడట. అంతేకాదు.. ఇప్పటికి ఈ సినిమా కు సంబంధించిన ఏ చిన్న క్లిప్ కనిపించిన నాగార్జున అదే ఫీల్ అవుతాడట.