టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా రాణిస్తున్నాడు. అలా తాజాగా నటించిన మూవీ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి సిటీ హీరోయిన్గా మెరిసింది. మే డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో నటిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నాని.. తన నేచురల్ నటనతో అందరిని కట్టిపడేసాడు.
కానీ.. ఈ సినిమాలో మాత్రం కనివిని ఎరుగని ఊర మాస్ వైలెన్స్ తో ఆడియన్స్‌కు వణుకు పుట్టించాడు. అసలు మనం ఇప్పటివరకు చూసిన నాని.. ఈ నాని ఒక్కడేనా అనేంతగా నటనతో గూస్‌సంప్స్ తెప్పించాడు. ఈ క్రమంలో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతోపాటు.. కలెక్షన్ల పరంగాను సంచలనం సృష్టిస్తుంది. అలా తాజాగా హిట్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.43 కోట్ల వసూలు కొల్లగొట్టినట్లు అఫీషియల్ గా ప్రకటించారు.
ఇక నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన రెండో సినిమాగా హిట్ 3 సంచలనం సృష్టించింది. ఇక దేశవ్యాప్తంగానే కాదు.. ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఫ్రీ బుకింగ్ లోనే సత్తా చాటుకున్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత అదే జోష్ కొనసాగిస్తుంది. ఓవర్సీస్ లో ఫస్ట్ డే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన హిట్ 3.. వారాంతంలో రెండు మిలియన్ క్లబ్ లోను చేరే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్‌లలోను సంచలనం సృష్టించింది. బుక్ మై షో లో హిట్ ది థర్డ్ కేస్ సినిమాకు 24 గంటల్లో రూ.2.72 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం సాధారణ విషయం కాదు. నాని కెరీర్‌లోనే ఒక్కరోజు ఇన్ని టికెట్స్ సేల్ అయిన మొదటి సినిమా ఇదే.