మహేష్ బాబు వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్ వార్.. చిచ్చు రేపిన రీ రిలీజ్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సినిమాలు రిలీజై మంచి కలెక్షన్లు కొల‌గొడుతున్నాయి. గతంలో హిట్ అయిన టాలీవుడ్ హీరోల సినిమాలు మళ్లీ రీ రిలీజ్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్న నిర్మాతలు.. భారీ లాభాలను అందుకుంటున్నారు. అయితే ఈ రీరిలీజ్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయడం వరకు బానే ఉన్నా.. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ఉన్నప్పుడు మాత్రం మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్ వార్‌లు మొదలైపోతున్నాయి. అలా తాజాగా.. రీ రిలీజ్ అయిన మూవీస్ కారణంగా మహేష్ బాబు, ప్రభాస్ అభిమానుల మధ్యన వీర్ చెల‌రేగింది.

Mahesh Babu and Trivikram Films Athadu and Khaleja Set for Re-Release | cinejosh.com

ఇంతకీ రీ రిలీజ్ వల్ల మహేష్, ప్రభాస్ ఫ్యాన్స్ వార్‌ ఏంటి.. అసలు ఏం జ‌రిగిందో ఒకసారి చూద్దాం. సాధారణంగా.. ఏ హీరో సినిమా నైనా సరే.. రిలీజ్ చేయాలంటే ఆ స్టార్ హీరో బర్త్డే.. లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ చూసుకుని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మహేష్ ఖలేజా సినిమా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాను 4కె వర్షంలో మే 30న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. ఖలేజా రీ రిలీజ్‌కు ట్రైలర్ కూడా వదిలారు. ఇదిలా ఉంటే.. నేడు ప్రభాస్ వర్షం సినిమాను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే రెండుసార్లు రిలీజైన ఈ సినిమా మొదటిసారి తో పోలిస్తే ఇప్పుడే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది.

Prabhas' superhit movie Varsham set for a grand re-release – Here's when

4k వర్షం లో రిలీజ్ అయిన ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్‌ నెలకొంది. కారణం ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరో. ఈ క్రమంలోనే వర్షం రీ రిలీజ్‌ను దేశ వ్యాప్తంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు, ప్రభాస్ అభిమానుల మధ్య ఈ సినిమాల విషయంలో గొడవ మొదలైంది. అసలు గొడవ ఏంటనేది తెలియదు కానీ.. ప్రభాస్ అభిమానులు మాత్రం మహేష్ అభిమానిని నడిరోడ్డుపై చితకొట్టేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ గొడవకు సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారుతుంది. దీంతో.. హీరోలంతా బానే ఉంటారు. రీ రిలీజ్ వ‌ల్ల కూడాఈ ఫ్యాన్స్ ఏమో కొట్టుకుని చ‌స్తున్నారు అంటూ ఈ ట్రెండ్ ఇక నైనా ఆపేస్తే బెట‌ర్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు జనం.