హిట్ 4: హిట్ 3 క్లైమాక్స్ లో వచ్చిన ఎసీపీ వీరప్పన్ ఎవరో తెలుసా.. హిట్ 4 హీరో బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

హిట్ ఫ్రాంచైజ్ నెక్స్ట్ హీరో ఎవరో.. తాజాగా రివీల్ అయ్యింది. హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్ సర్కార్‌గా నాని పాత్రను మేకర్స్‌ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అలా ఇప్పుడు హిట్ 3 క్లైమాక్స్‌లో హిట్ 4 హీరోని కూడా ఆడియ‌న్స్‌కు పరిచయం చేశారు. అమెరికా ప్రీమియర్ షోస్ ఇటీవ‌ల‌ ముగియడంతో.. ఆ హీరో ఎవరు అందరికీ క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం.

గత కొద్దిరోజులుగా హిట్ 4లో కార్తీ హీరోగా నటించనున్నాడు అంటూ లీక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై డైరెక్టర్ శైలేష్ కొలను కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక హిట్ 3 క్లైమాక్స్‌లో కార్తికి సంబంధించిన సీన్స్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేశారు. ఈ క్రమంలోనే విషయం బయటకు లీక్ అయింది. కాగా.. ఇప్పుడు హిట్ 4లో హీరో.. కార్తీ నే అని అఫీషియల్‌గా తేలిపోయింది.

ఇక మూవీ క్లైమాక్స్ కార్తీ ఎంట్రీ గూస్ బంప్స్‌ తెప్పించింది. ఎసీపీ వీరప్పన్ రోల్‌లో ఆయన చార్జి తీసుకున్నట్లు చూపించారు. ఇక‌ సిల్వర్ స్క్రీన్ పై రిపోర్ట్ చేయనున్న కార్తీ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందట. ఇక హిట్ 4లో ఈయన చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమానిగా మెరువనున్నారు. మరి సీఎస్కే ఫ్యాన్.. ఎసీపీ వీరప్పన్ ఏం ఆపరేషన్ చేయనున్నాడో.. హిట్ 4లో చూడాల్సిందే.