టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఇటీవల కాలంలో తన రూట్ పూర్తిగా మార్చేశాడు. ఫ్యామిలీ స్టోరీస్, లవ్ స్టోరీస్, సాఫ్ట్ కంటెంట్లతో రాణించిన ఆయన.. తనలోని మాస్ హీరోను ఎలివేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. కమర్షియల్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల దసరాతో మాస్ హీరోగా పరిచయమై ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నాని.. తన కెరీర్‌లో ఎక్స్‌పరిమెంటల్ సినిమాలతోనూ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇందులో భాగంగానే మరోసారి హిట్ 3 తో సరికొత్త ఎక్స్పరిమెంట్ చేశారు.
ఈ సినిమా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందింది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరిసింది. ఇక.. నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయినా ఈ మూవీ మార్నింగ్ షోస్ ఇప్పటికే షురూ అవుతున్నాయి. ఇక ఈ సినిమానే ఎందుకు చూడాలి..? హిట్ 3 చూడడానికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ ఐదు ప్రధాన కారణాల్లో మొదటి వరుసలో నాని పేరు వినిపిస్తుంది. సినిమాలో పూర్తి రక్తపాతంతో.. వైలెన్స్ సృష్టించే పాత్రలో నాని కనిపించనున్నాడు. ఇప్పటివరకు నానిని ఎలాంటి తరహా పాత్రలో చేసింది లేదు. ఇక ఈ సినిమా యాక్షన్ సీన్స్ అదిరిపోతాయట.
ఈ క్రమంలోనే నాని ఈ పాత్రలో ఎలా నటించబోతున్నాడని క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే హిట్ ఫ్రాంచైజ్ ఇప్పటివరకు సక్సెస్ఫుల్ గా రన్ అయింది. దానికి తోడు హిట్ 3 ప్రొడ్యూసర్‌గా నాని వ్యవహరిస్తున్నాడు. నాని నిర్మించడం అంటే కచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుందని నమ్మకం జనంలో ఉంటుంది. నాని నాచురల్ నటనకు తన సినిమాల్లో ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ. ఈ క్రమంలోనే హిట్ 3లో ఒకటి నుంచి ప్రధానంగా మూడు కారణాలు నాని నటనే. ఇక ప్రీమియర్ రివ్యూలతో నాని నటన వేరే లెవెల్ లో ఉందని.. సినిమాకు అదే హైలెట్ కానుందని సమాచారం. ఇక నాలుగో ప్రధాన కారణం మీకీ జే మేయర్.
క్లాస్, మెలోడీ ట్యూన్స్‌తో ఆడియన్స్‌ను ఇప్పటికే మెప్పించిన మిక్కీజే మేయర్ ఇలాంటి మాస్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు అందించలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా మ్యూజిక్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. వీటితో పాట్టే డైరెక్షన్, టెక్నికల్ అంశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఐదో కారణం రిలీజ్ డేట్. ఇప్పటి వరకు సమర్.. సరైన సాలిడ్ సినిమా పడిందలేదు. ఆడియన్స్‌ను పెద్దగా ఎంటర్టైన్ చేసే సినిమాలేవి రాలేదు. ఈ క్రమంలోనే ఒక కమర్షియల్ హిట్ కొరత టాలీవుడ్ లో ఉంది. ఇక నాని నుంచి ఓ సినిమా అంటే మినిమం హిట్ గ్యారెంటీ అని అంతా భావిస్తారు. సినిమాను చూడడానికి ఆసక్తి చూపుతారు.