మంచు విష్ణుకు సారీ చెప్పిన శ్రీ విష్ణు.. కన్నప్ప టీం హర్ట్ అయ్యారంట అంటూ.. షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు మే 9న సింగల్ సినిమాతో ఆడియన్స్ను పలకరించనున్నాడు. ఈ క్ర‌మంలోనే సినిమా ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంది. అయితే.. ట్రైలర్‌లో శ్రీ విష్ణు శివయ్య అని డైలాగ్‌, అలాగే మంచు కురిసిపోవడం అనే డైలాగ్ వాడిన‌ట్లు చూపించారు. ఈ రెండిటిపై మంచు విష్ణు ఫైర్ అయ్యాడని.. కన్నప్ప టీజర్ లో శివయ్య అనే డైలాగులు ట్రోల్స్ చేశారని.. అలాగే లాస్ట్ లో బూతు పదం ప్లేసులో మంచు కురిసిపోవడం అని తన ఇంటిపేరును హేళన చేస్తూ ట్రైలర్ రూపొందించారని విష్ణు హర్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ రెండు డైలాగుల విషయంలో మంచు విష్ణు యూనిట్ పై టాలీవుడ్ పెద్దలకు, ఫిలిం చాంబర్ కు ఫిర్యాదు చేశాడని.. అలాగే యూనిట్‌కు కాల్ చేసి మరీ హెచ్చరించాడ‌ని.. మర్యాదగా సినిమాలో ఆ డైలాగులు తీసేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.

Sree Vishnu apologies to Vishnu Manchu Kannappa team over Shivayya dialogue  | Sree Vishnu vs Vishnu Manchu: శివయ్యా... డైలాగ్ తొలగించాం - విష్ణు మంచు &  'కన్నప్ప' టీంకు సారీ చెప్పిన శ్రీవిష్ణు

ఈ వార్తల్లో వాస్తవం ఏంతో తెలియదు కానీ.. శ్రీ విష్ణు మాత్రం ఈ విషయంపై మొత్తానికి సారీ చెప్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ మా సింగల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కన్నప్ప టిం మేము వాడిన డైలాగ్‌లకు హర్ట్ అయ్యారని తెలిసింది. కానీ.. కావాలని మేము ఏది చేయలేదు. తప్పుగా కన్వే అయింది అంతే. మేము ఇమీడియట్ గా దానిపై స్పందిస్తున్నాం. ఆ డైలాగ్ తీసేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఆ డైలాగ్ సినిమాలో కూడా ఉండవని.. ఎవ‌రిని హర్ట్ చేద్దామని ఉద్దేశంతో ఈ సినిమాలో ఏది తెర‌కెక్కించలేదని.. ప్రజెంట్ జనరేషన్ వాడే సినిమా రిఫరెన్స్‌లు.. మెయిన్స్‌కు ఎక్కువగా వాడడం ఈ ప్రాసెస్‌లోనే.. చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, అల్లు అరవింద్ గారి డైలాగులను కూడా వాడేసాం.

Sri Vishnu : కన్నప్ప టీం కి క్షమాపణలు చెప్పిన శ్రీ విష్ణు..వీడియో వైరల్! |  entertainment news in telugu | ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇన్ తెలుగు

ఒక పాజిటివ్ వైబ్‌తోనే.. కామెడీ పండించాలని ఉద్దేశంతో ఇది చేసాం. అలాంటివి ఏవైనా మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి క్షమించండి. ఇండస్ట్రీ అంతా ఓ ఫ్యామిలీ. ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు పడితే సారీ. హర్ట్ అయిన వాళ్ళందరికీ మరోసారి చెప్తున్నా.. ఇండస్ట్రీ అంతా ఒకటే అంటూ వీడియోను షేర్ చేశాడు. ఇక మంచి విష్ణు టీం శ్రీ విష్ణు కి సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేయాలని సీరియస్ అయ్యారని.. అందుకే శ్రీ విష్ణు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పలువురు శ్రీ విష్ణు ఫ్యాన్స్ సినిమాలో రెగ్యులర్ కామెడీ కామన్.. శ్రీ విష్ణు సినిమాలన్నీ ఇంచుమించు ఇలానే ఉంటాయి. సినిమాని సినిమాల చూడకుండా ఇలాంటి కంప్లైంట్ చేయడం సరైనది కాదు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.