హిట్ 3 ట్విట్టర్ రివ్యూ.. రక్తపాతం సృష్టించిన నాని.. వైలెన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడా..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ హిట్ 3. ఈ ఏడాది టాలీవుడ్ ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరిసింది. ఇక నాని సినిమాలంటే సాఫ్ట్‌.. నాచురల్, సెన్సిటివ్ స్టోరీస్ గుర్తుకు వస్తాయి. కానీ.. వాటికి పూర్తి భిన్నంగా రూపొందిన ఈ మోస్ట్ వైలెంట్ ఎంటర్టైనర్ మూవీ.. నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోస్ ముగిశాయి. ఇక సినిమా ఎలా ఉంది.. హిట్ 3తో మరోసారి నాని బ్లాక్ బస్టర్ కొట్టాడా.. లేదా.. రివ్యూ లో చూద్దాం.

హిట్ 3 మోస్ట్ వైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూసామని.. నాని ప్రమోషన్ లో చెప్పినట్లు పిల్లలు, ఫ్యామిలీ సినిమాలోని రక్తపాతం, వైలెన్స్ తట్టుకోవడం కష్టం అంటూ వివరిస్తున్నారు. బోల్డ్‌ డైలాగ్స్ కూడా సినిమాలో ఎక్కువగానే ఉన్నట్లు రివ్యూ లో పేర్కొన్నారు.

ఇక సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని.. ఒక్కో ఫైట్ సీక్వెన్స్ ఒక్కో క్లైమాక్స్‌లా ఉందంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉందని.. స్క్రీన్ ప్లే కూడా ప్రిడిక్టబుల్గా ఉందని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్, ట్విస్ట్‌ మాత్రం థ్రిల్లింగ్ గా ఉండనిందని.. సెకండ్ హాఫ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని.. ఇంట్రెస్ట్ ఆద్యంతం ఉండేలా ప్రేక్షకుల్లో హై మూమెంట్‌ను క్రియేట్ చేసిందని.. ఇది ఓ రాఅండ్‌రిస్టిక్ మూవీ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇక సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు.. కొరియన్ సిరీస్ స్క్వాడ్ గేమ్ నుంచి స్ఫూర్తి పొందినట్లు ఉన్నాయ్ అంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విస్టుల కంటే మాస్ మూమెంట్స్ వేరే లెవల్ అని.. నాని హీరోయిజాని నమ్ముకుని హిట్ 3ని శైలేష్ కొలను రూపొందించాడంటూ.. ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ గూస్ బంప్స్ కాయమంటూ చెబుతున్నారు. గెస్ట్ రోల్స్ అందర్నీ సర్ప్రైజ్ చేస్తాయట.

అర్జున్ సర్కార్ గా నాని అదరగొట్టాడని.. ఇక యాక్షన్ రోల్ లో నాని నటన, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ సరికొత్తగా చూపించాడని.. తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ క‌నిపించిందంటూ చెప్తున్నారు. నాని, శ్రీనిధి కెమిస్ట్రీ.. వాళ్ళ కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్స్ ఆడియన్స్‌ను మెప్పించాయట. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయంటా చెబుతున్నారు. అయితే.. బిజీ ఏం మాత్రం సినిమాకు పెద్ద మైనస్ అని.. నెటిజ‌న్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై ఉన్న పూర్తి అంచనాలను రీచ్ కాలేకపోయినా నాని.. యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ మూమెంట్స్ కు ఆడియన్స్ ఫిదా అవ్వాల్సిందే.. హిట్ 3 ఓసారి చూడొచ్చు అంటూ ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.