హిట్ 4 : ఎసిపి వీరప్పన్ రోల్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటించిన తాజా మూవీ హిట్ 3. ప్రజెంట్‌ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా ఈ సినిమా నిలవనుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఇప్పటివరకు చూసినా నానికి.. ఈ సినిమాల్లో కనిపించిన నాని మాస్ పర్ఫామెన్స్‌కు అసలు పొంతనే ఉండదు. నిన్న మొన్నటి వరకు సాఫ్ట్ కంటెంట్ ను ఎంచుకుంటూ ఫ్యామిలీ లవ్ స్టోరీలతో ఆకట్టుకున్న నాని దసరాతో.. మాస్ హీరోగా ఎలివేట్ అయ్యే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక హిట్ 3తో కమర్షియల్ మాస్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

ఇక ఈ ప్ర‌య‌త్నంలో నాని సక్సెస్ అయ్యాడు అనడంలోనూ అతిశయోక్తి లేదు. ఈ సినిమా మొత్తంలో నాని ని చూస్తే ఒక్కసారి కూడా ఆడియన్స్ కు నవ్వు రాదు అని చెప్పడంలో సందేహం లేదు. నాని లో ఇంత వైల్డ్ యాంగిల్ దాగి ఉందన్న సంగతి హిట్ 3 ద్వారా ఆడియన్స్‌కు క్లారిటీ వచ్చేసింది. ఇక పాజిటివ్ రివ్యూస్‌తో క‌లెక్ష‌న్‌ల ప‌రంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న‌ హిట్ 3 క్లైమాక్స్ లో హిట్ 4 కేస్ హీరోను రివిల్ చేశారు టీం. అయితే.. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాలో హీరో రోల్ కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ ని ఎంచుకున్నారు. ఎసిపి వీరప్పన్ పాత్రలో కార్తీక్ ఇంట్రడక్షన్ సినిమాకు హైలెట్.

ఇక మొదట ఏసిపి వీరప్పన్ రోల్ కోసం కార్తిని కాకుండా టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజను అప్రోచ్ కాగా.. ఆయన సినిమా కథను రిజెక్ట్ చేశారని.. ఈ రేంజ్ వైలెన్స్ ఉన్న పాత్రలు నాకు సెట్ కావంటూ సినిమాను వదులుకున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్‌ వైరల్ కావ‌డంతో.. రవితేజ ఈ రోల్‌ను మిస్ చేసుకోకుండా ఉండాల్సింది అంటూ.. ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతున్న ఆయన.. ఇలాంటి కంటెంట్‌లో నటించి ఉంటే కచ్చితంగా స్ట్రాంగ్ థ్రో బ్యాక్ ఇచ్చి ఉండేవాడంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.