టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. డైరెక్టర్ శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. ఇక రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన ఏ సినిమా.. మే 1(నిన్న) గ్రాండ్ లెవెల్లో రిలీజై వారి అంచనాలను అందుకుంది. ఈ క్రమంలోనే ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఫుల్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ.. కలెక్షన్ల పరంగా సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొడుతుంది.
నాని నటన సినిమాకి హైలెట్గా మారిందంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించాడంటూ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన కొద్ది గంటలకే యూఎస్ మార్కెట్లో హిట్ 3 దుమ్ము రేపుతుంది. ఇంతకీ యూఎస్ మార్కెట్లో హిట్ 3కి ఏ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. మే 1 (నిన్న) రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్క రోజులోనే 1 మిలియన్ డాలర్ గ్రాస్ క్లబ్ లో చేరడం అంటే సాధారణ విషయం కాదు.
అలాంటిది కేవలం ఒక్కరోజులోనే ఈ రేంజ్ కలెక్షన్లు అందుకున్నాడు నాని. ఏకంగా 1 మిలియన్ 1 లాక్ డాలర్ల మార్క్ టచ్ చేసి రికార్డ్ సృష్టించాడు. ఇలా మొత్తానికి హిట్ 3 మ్యానియా యూఎస్ మార్కెట్లో మాత్రం సంచలనం సృష్టించింది అని చెప్పాలి. ఇక వీకెండ్‌కి కూడా ఇదే బజ్ కొనసాగితే.. ఈజీగా రెండు మిలియన్ల మార్క్ ను మూవీ దాటేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక యూఎస్‌లోనే నాని సినిమాకు ఫస్ట్‌డే ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చాయంటే..తెలుగు రాష్ట్రాల్లో ఏరేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టి ఉంటుందో తెలుసుకోవాలని ఆశక్తి ఆడియన్స్‌లో మొదలైంది. ఈ వివరాలు తెలియాలంటూ మరికొంతసేపు వేచి చూడాల్సిందే.