టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన తాజా మూవీ హిట్ 3. శైలేష్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడం.. నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాల్లో రావు రమేష్, సూర్య, శ్రీనివాస్ మాగంటి, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలో నటించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించగా.. సాను జాన్ వర్గేసే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్ గా పనిచేశారు. ఇక భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాతో నాని బ్లాక్ బస్టర్ కొట్టడా.. లేదా.. ఆడియన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడా.. నిర్మాతగా ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో ఒకసారి రివ్యూ లో చూద్దాం.
స్టోరీ:
అర్జున్ సర్కార్ (నాని) కాస్త కూడా దయలేని పోలీస్ ఆఫీసర్. వందమంది అమాయకులు చనిపోయిన పర్లేదు ఒక క్రిమినల్ మాత్రం బతకకూడదు అనుకునే మెంటాలిటీ. తన చేతికి దొరికిన క్రిమినల్స్ కు నరకం చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో ఈ క్రేజీ కాప్ చేతిలోకి ఓ పవర్ ఫుల్ సైకో కిల్లర్ వస్తాడు. వరుసగా హత్యలు చేస్తూ పట్టుకోవాలని సవాళ్లు విసిరితో ఉంటాడు. అలాంటి కేసులో అర్జున్ సర్కార్ ఎంట్రీ.. ఇన్వెస్టిగేషన్.. తర్వాత ఆ కాప్ తన లాటికీ పని చెప్పాడా..? ఇంతకీ అసలు ఆ సైకో థ్రిల్లర్ ఎవరు.. అతని మోటో ఏంటి.. ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడు సినిమాలో చూడాల్సిందే.
రివ్యూ:
నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ ఆడియన్స్ పల్స్ పట్టేసాడు. తను నటించిన ప్రతి సినిమాతోను ఆడియన్స్‌ను మెప్పించి బ్లాక్ బాస్టర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలా పరంపరను డెవలప్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాని నటించిన తాజా మూవీ హిట్ ద థర్డ్ కేస్. ముందు నుంచే ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక శైలేష్ కొలను ఈ సినిమాను ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే రూపొందించి.. పాజిటీవ్ టాక్ దక్కించుకున్నారు.
ఫస్ట్ నుంచి ఎక్కడ టైం వేస్ట్ కాకుండా కథ మొదలుపెట్టిన శైలేష్.. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచి క్యారెట్ ట్రైసేషను పీక్స్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. క్రిమినల్స్ తో అర్జున్ ఉండే తీరు చూస్తే ఆడియన్స్ లో గూస్ బంప్స్ వచ్చేలా డిజైన్ చేశాడు. అంత కిరాతకంగా అర్జున్ సర్కార్ పాత్రను డిజైన్ చేశాడు. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతికి సైకో కిల్లర్ దొరికితే అతని స్పీడ్ మరింతగా పెరుగుతుంది అని చూపించాడు. ఈ సినిమాల్లో చాగంటి ప్రవచనాలు బలే వాడుకున్నాడు. డైరెక్టర్.. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టి మెప్పించాడు. ఫస్ట్ ఆఫ్ అంత సైకో చేసే హత్యలు ఇన్వెస్టిగేషన్ తో వెళ్లిపోయింది.
చిన్నపిల్లల ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. ఎమోషనల్ గాను ఈ సీన్స్ అద్భుతంగా రాశాడు డైరెక్టర్. అక్కడక్కడా సన్నివేశాలు ఒళ్ళు గగ్గురుపొడిచేలా ఉన్నాయి. మరో వైపు సీరియస్ ట్రాక్ చేస్తూనే అక్కడక్కడ నాని, శ్రీనిధి మధ్య కెమిస్ట్రీని ప్లాన్ చేసి ఆడియన్స్ కు రిఫ్రెష్మెంట్ కల్పించాడు. సెకండ్ హాఫ్ అంత ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌కు తీసుకువచ్చాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అనడంలో అతిశయోక్తిలేదు. హిట్ 1, 2 కేసులతో థర్డ్ కేస్ ముడిపెట్టిన విధానం సినిమాలో మరింత ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ టీజర్ లో చూపించిన కోడ్ సీన్స్ అయితే సినిమాలో చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ తెప్పించాయి. అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ట్విస్ట్‌లు మెప్పించాయి.
సింపుల్ స్టోరీనే ఎన్నో మలుపులతో డిజైన్ చేశాడు డైరెక్టర్. క్లైమాక్స్లో నాని యాక్షన్ సీక్వెల్స్ దుమ్మురేపాడు. వామ్మో ఏంటిది ఇంత కృయల్‌గా నాని రోల్ డిజైన్ చేశారు అనిపించింది. కానీ.. నాని పర్ఫామెన్స్ కూడా అదే లెవెల్‌లో ఉంది. అందుకే మధ్యలో డైలాగ్ కూడా పెట్టారు.. ఇన్ని రోజులు చూసిందే నేను అనుకుని మోసపోయారు జనం.. నేను చూపిస్తా ఒరిజినల్ అని.. దానికి తగ్గట్లుగానే నాని రోల్ కూడా ఉంటుంది. పిల్లలకు నో ఎంట్రీ.. వచ్చారా వణికిపోవాల్సిందె. హిట్ 3ని వైలెంట్‌గా తీయాలని ఫిక్సైపోయినపుడే ఏ సర్టిఫికేట్‌కు రెడీ అయిన మేకర్స్.. ఎక్కడా దాపరికం లేకుండా చేయాలనుకున్న యాక్షన్ చూపించేశారు. చాలా వరకు అది వర్కవుట్ అయింది. సెకండా హఫ్ చాలావరకు స్క్విడ్ గేమ్ నుంచి స్ఫూర్తి పొందిన ఫీల్ కలుగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
నాని గురించి తెలిసిందే. పాత్ర ఏదైనా అందులోకి దూరిపోయి ఆకట్టుకునే ఆయన.. ఈసారి అర్జున్ సర్కార్‌గా నట విశ్వరూపం చూపించాడు. యాక్టింగ్‌తో దుమ్మురేపాడు. ఇక శ్రీనిథి శెట్టి చిన్న పాత్ర అయిన 100 పర్సంట్ ఇచ్చింది. పైగా యాక్షన్ సీన్స్‌లోను మెప్పించింది. హిట్ ఫ్రాంచైజీలో శ్రీనాథ్ మాగంటి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్ సహా మిగత వాళ్లంతా తమ పాత్రలలో అద్భుతంగా చేసారు.
టెక్నికల్ టీం:
మిక్కీ జే మేయర్ సంగీతం కాస్త స్లో అనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్. సాను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ గుడ్. జమ్మూ కాశ్మీర్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్ బాగా ఎక్స్‌ప్లోర్ చేసి.. ఎడిటింగ్తోను మెప్పించారు. కాస్త రన్ టైం ఎక్కువున్నట్లు అనిపించిన.. పెద్దగా కంప్లైంట్‌గా ఉండదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక శైలేష్ కొలను ఈసారి పకడ్బందీగా కథ రాసుకున్నాడు . ముఖ్యంగా హిట్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ బాగా వాడుకున్నాడు. సెకండాఫ్ సినిమాకు కీలకంగా మారింది.
పనల్‌గా: స్క్రీన్‌పై బ్లాడ్ బాత్‌తో వణికిప్తునే.. మెప్పించాడు అర్జున్ సర్కార్.