సమంతతో చైతు డివోర్స్ కు కారణం అదేనంటూ.. శోభితపై షాకింగ్ రూమర్లు. !

అసలు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఒకరిని ఒకరు ప్రేమించుకుని వివాహం చేసుకోవడం లైఫ్ లాంగ్ కలిసి ఉండడం చూస్తూనే ఉన్నాం. అలాంటి స్టార్ కపుల్‌ని చూసిన ఎంతోమంది సాధారణ కుర్ర కారు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాంటి లైఫ్ పార్ట్నర్ తమక కూడా కావాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ.. అలా ఎంతోమందికి ఒకప్పుడు ఇన్స్పిరేషనల్ గా మారిన జంటలు ఏవో కారణాలతో తర్వాత విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో మొదటి అక్కినేని నాగచైతన్య, సమంతల జంట పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక నాగచైతన్య సమంత చాలా కాలం సీక్రెట్ లవాయణం తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి గ్రాండ్ లెవెల్లో వివాహం చేసుకున్నారు.

అప్పట్లో వీరిద్దరి జంట ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ పెయిర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ పేరు అంటే చాలామందికి ఇష్టం. అయితే.. పెళ్లయిన మూడేళ్లకే వీరిద్దరూ విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పటికి ఈ జంట విడిపోవడానికి కారణం ఇదేనంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య రెండో పెళ్లిపై కూడా చర్చలు మొదలయ్యాయి. సమంతతో విడాకుల తర్వాత చైతన్య.. శోభిత ధూళిపాళ‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. వీరిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని.. దీనిపై అక్కినేని కుటుంబం అఫీషియల్ గా ప్రకటించనుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఈ నేపథ్యంలో మరోసారి చైతు సమంతతో విడాకుల‌ ప్రధాన కార‌ణం పిల్లలేనని.. నాగచైతన్యకు పిల్లలంటే ఇష్టం. కానీ.. సమంత నో చెప్పిందని.. అందుకే వాళ్ళు విడిపోయారని.. అంతేకాదు అప్పటికే మయోసైటీస్తో వీకైన సమంత పిల్లలను తాను కనలేనని చెప్పడంతో నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చేసాడు అంటూ.. ఇలా పిల్లల కారణంగానే వీరిద్దరి మధ్య విడాకులు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో చైతన్య.. శోభితను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి శుభవార్త చెప్పనున్నాడు అంటూ టాక్ వైరల్ అయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే చైతు,స‌మంత విడిపోవడానికి కారణం పిల్లలో.. కాదో.. తెలియదు కానీ నాగచైతన్య, శోభితలు మాత్రం తల్లిదండ్రులు కాబోతున్నారన్నమాటలో వాస్తవం లేదట. అవన్నీ కేవలం పుకార్లేనని తెలుస్తోంది. కావాలనే సమంత విషయంలో కొందరు అత్యుత్సాహం చూపిస్తూ ఇలాంటి రూమర్లు క్రియేట్ చేస్తున్నారని సమాచారం.