బాలయ్య నయా కార్ చూసారా.. ఎట్టకేలకు నెంబర్ 1 దక్కించుకున్నాడు..!

గాడ్ ఆఫ్ మాసెస్‌ బాలయ్య ఇటీవల‌ bmw కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఖైరతాబాద్ ఆర్డిఏ కార్యాలయంలో.. ఆ నెఃబ‌ర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక తాను కోరుకున్న ఆ ఫ్యాన్సీ నెంబర్ TG09F0001 రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి భారీ పోటీనే నెలకొంది. ఈ ఫ్యాన్సీ నెంబర్లు వేలంలో తాను కోరుకున్న నెంబర్ కోసం బాలయ్య ఏకంగా రూ.7.75 లక్షల డబ్బును ఖర్చు చేశారు.

నగరంలో బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు సైతం ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం పోటీ పడగా.. బాలయ్య ఎవరికీ చాన్స్ ఇవ్వకుండా నెంబర్ 1ను సొంతం చేసుకున్నాడు. ఏడు లక్షలకు పైగా వేలంపాటి అందరికీ షాక్ ఇచ్చాడు ఈ క్రమంలోనే బాలయ్య అంతలా ఆ ఫ్యాన్సీ నెంబర్ కోసం టార్గెట్ చేసి చివరకు నెంబర్ వన్ దక్కించుకోవడం పై విభిన్నమైన కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా బాలయ్య ఆ నెంబర్ తో కార్ నుంచి దిగిన ఫొటోస్, వీడియోస్ తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనిపై రియాక్ట్ అయిన నెటిజ‌న్స్‌ అది నంద‌మూరి న‌ట‌సింహ‌ రేంజ్ అంటూ.. ఎప్పుడు బాలయ్య నెంబర్ వన్ అంటూ.. అనుకున్న దానికోసం ఎక్కడికైనా వెళ్తా.. ఏదైనా చేస్తా.. ఎంత ఖర్చైనా పెడతా అంటూ.. బాలయ్య అదుర్స్ అంటూ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ కొత్త బీఎండబ్ల్యూ కార్ అదిరిపోయింది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.