కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటేస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సూర్య నుంచి గ్రేట్ కంబ్యాక్ సినిమా అవుతుందని అంతా భావిస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజైంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో.. సూర్య ఈ మూవీతో హిట్ కొడతాడో లేదో రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ మూవీ 1993కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో సాగే కథ. కాగా.. తన చిన్నతనంలోనే పారివేల్ కణ్ణన్ (సూర్య) తన తల్లిదండ్రుల నుంచి పారిపోతాడు. ఒక గ్యాంగ్ స్టర్ తిలక్ రాజ్ (జోజు జార్జ్) కి దొరుకుతాడు. అయితే అతని భార్య కోరుకోవడంతో పారిను పెంచుకుంటాడు. కానీ.. పారి అంటే అతనికసలు ఇష్టం ఉండదు. తను దొరికిన పరిస్థితులుతో పారికి చిన్నతనం నుంచి ఆనందం అనేది తెలియదు. ఇలాంటి క్రమంలో రుక్మిణి (పూజా హెగ్డే) తో జరిగిన పరిచయం ఎలా ప్రేమగా మారుతుంది.. తర్వాత తన కోపం, నవ్వు.. పారి లైఫ్‌ను ఎలాంటి మలుపు తిప్పాయి. అసలు ఈ పారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఏ ప్రాంతానికి చెందినవాడు..? ఇక ఈ కథ మొత్తంలో అండమాన్ లో ఒక దీవిలో ప్రజలని బానిసలుగా చేసిన దొరలు రాజ్ వేల్, తన కొడుకు మైఖేల్ (వేదు) లు చేసే అరాచకాలు ఏంటి..? అక్కడికి పారి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది..? అసలు ఈ తిలక్ రాజ్ కోరుకుంటున్న గోల్డ్ ఫిష్‌కి.. పారికి ఉన్న లింక్ ఏంటి.. తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు:
ఫస్టాఫ్ అంతా స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందిందని చెప్పవచ్చు. మేకర్స్ మొదట చెప్పినట్లు గానే లవ్, లాఫ్టర్ (నవ్వు), వార్ పాయింట్స్ కి తగ్గట్టుగా కథనం మంచి ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఇక సూర్య నటన సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. తన లోని నటుణ్ని మిస్ అవుతున్న ఫ్యాన్స్‌కు.. చాలా కాలం తర్వాత ఈ సినిమా ఫస్టాఫ్ ద్వారా చూపించేశాడు. తనలో ఉన్న లోపంని అద్దంలో చూసుకునే సీక్వెన్స్ లో.. సూర్య ఒదిగిపోయి నటించాడు అనడంలో సందేహం లేదు. అలాగే తనపై కొన్ని క్రేజీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మెప్పించాయి. అంతేకాదు ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక పూజ హెగ్డే తన నటనతో ఆకట్టుకుంది. వీళ్ళతో పాటు జోజు జార్జ్ ఇంకా జయరామ్‌లు.. తన గత సినిమాలతో పోలిస్తే మరింత డిఫరెంట్ పాత్రలో ఆకట్టుకున్నారు. నెగిటివ్ రోల్‌లో కనిపించిన పాత్రలో జీవించేసాడు. నటనతో అదరగొట్టాడు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్.. అందుకు తగ్గ కనెక్షన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఫస్ట్ హాప్‌లో ఒక సింగల్ టెక్ సీక్వెన్స్ సినిమా చూసిన ఆడియోస్ అందరినీ ఆకట్టుకుంటాయి.. అనడంలో సందేహం లేదు.
మైనస్ లు:
డీసెంట్ ఫస్ట్ ఆఫ్ లో కొనసాగించిన కార్తీక్ సుబ్బరాజు.. యుద్ధంతో ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చి సెకండ్ హాఫ్ ని ఎంగేజింగ్ గా నడపడంలో కాస్త తడబడిన ఫీల్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్.. సెకండ్ హాఫ్ పై మంచి హైప్ పెంచేలా డిజైన్ చేసిన ఆయన.. సెకండ్ హాఫ్‌ను మాత్రం డల్ గా సాగదీతగా తీశాడు. కథ ఆసక్తిగా మొదలై.. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయింది. కథ మొదట్లో ఉన్న ఆసక్తి ఆడియన్స్‌లో తర్వాత ఉండదు. సూర్య కొన్ని సీన్స్ మెప్పించిన.. అవన్నీ ఫ్లోలో క్యారెక్టర్ గా లేవు అన్న ఫీల్ కలుగుతుంది. ఇక ఫ్రీ క్లైమాక్స్ సూర్య పై ట్విస్ట్ వచ్చే వరకు కథనం అంతా చాలా డల్ గా సాగింది. అంతేకాదు.. చాలా సన్నివేశాలు గతంలో చూసిన సినిమాలను పోలిన ఫీల్ కలుగుతుంది. ఇక అక్కడక్కడ సన్నివేశాలను ముందే గెస్ చేసేయవచ్చు. ఇక అన్నిటికన్నా పెద్ద డ్రాబాక్స్ క్లైమాక్స్ అనుకున్న పాయింట్ కి.. ప్లాన్ చేసుకున్న క్లైమాక్స్ కు అస్సలు సెట్ కాలేదు. అప్పటివరకు స్ట్రాంగ్ గా ఉన్న విలన్‌లు.. సులువుగా లొంగిపోయిన ఫీల్ వస్తుంది. వాటితో చాలా అంశాలు సెకండ్ హాఫ్‌లో ఫ్యాన్స్‌కు నిరాశ మిగిల్చాయి.
టెక్నికల్ గా:
మంచి నిర్మాణ విలువలతో రూపొందిన ఈ సినిమాలో.. సంతోష్ నారాయణ ఇచ్చిన సంగీతం చాలా సన్నివేశాలకు మంచి స్కోప్. చక్కగా ఎలివేట్ చేశాడు. అక్కడక్కడ సినిమాలో స్కోర్ కూడా మ్యూజిక్‌కే పడింది. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ మెప్పించింది. నేపథ్యం కి తగ్గట్టు రెట్రో విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ కొంచెం బెటర్ గా డిజైన్ చేయాల్సింది అన్న ఫీల్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ విలువల సైతం మెప్పించాయి. ఇక కార్తీక్ సుబ్బరాజు ఎంచుకున్న కథ బాగున్నా.. అందులో పాయింట్స్ ఆకట్టుకుంటున్నా.. వాటికి అనుగుణంగా రాసుకున్న కథనం మాత్రం ఫుల్ ఫ్లడ్జ్ గా అనిపించలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా సాగదీతగా.. వీక్ గా వెళ్ళింది. ఎక్కడ ఫ్రీ క్లైమాక్స్‌లో కలిపిన లింక్ ఓకే గాని.. పూర్తిస్థాయిలో ఆడియన్స్‌ను మాత్రం మెప్పించేలా పని సాగలేదు. ఫస్ట్ ఆఫ్ వరకు కార్తీక్ తన మార్క్ చూపించాడు.
ఫైనల్ గా: రఎట్రో ఫ్యాన్స్ కు మాత్రమే.. అది కూడా అంచనాలు లేకుండా చూస్తే బెటర్.