టాలీవుడ్ జేజమ్మగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనుష్కకు టాలీవుడ్‌లో పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలో నటిస్తూ తిరుగు లేని క్రేజ్ సంపాదించుకున్న అనుష్క.. ప్రస్తుతం అడపదడప సినిమాల్లోనే నటిస్తున్నా.. ఈ అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే అనుష్క నాచురల్ స్టార్ నాని కాంబోలో ఓ సినిమా మిస్ అయిందంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. అది కూడా సూపర్ హిట్ మూవీ అట. ఇంతకీ ఆ మూవీ ఏంటి.. అసలు వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన మూవీ ఎందుకు మిస్ అయింది.. అనే వివరాలను ఒకసారి తెలుసుకుందాం.
వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావాల్సిన మాట వాస్తవమే కానీ.. నాని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. అనుష్క అంటే మొదటి నుంచి స్పెషల్ గౌరవం ఉన్నా.. ఆమెపై ఎంత ఇష్టం ఉన్నా.. ఆమెతో నటించే ఛాన్స్ ను మాత్రం నానినే స్వయంగా రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు అనుష్క కెరీర్‌లోనే స్ట్రాంగ్ కం బ్యాక్‌గా నిలిచిన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాలో అనుష్క శెట్టి నటనతోపాటు.. నవీన్ పోలిశెట్టి పర్ఫామెన్స్ పీక్స్ లెవెల్లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.
చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా స్మాల్ బడ్జెట్‌తో వచ్చి భారీ లాభాలను కొల్లగొట్టింది. అంతేకాదు.. చాలా కాలం గ్యాప్ తర్వాత అనుష్క సినిమాతో బిగ్ స్క్రీన్‌పై కనిపించడం ఫ్యాన్స్‌లో మరింత ఆనందాన్ని కల్పించింది. అదే సినిమాలో మొదట నవీన్ పోలిశెట్టి బదులు నానిని భావించారట మహేష్. కానీ.. నాని ఆ క్యారెక్టర్ ను చేయనని సున్నితంగా రిజెక్ట్ చేశాడట. ఇలాంటి క్యారెక్టర్ తనకు అసలు సూట్ కాదని భావించిన నాని ఆ కథను వదిలేసాడట. అలా వీళ్ళిద్దరి కాంబోలో మూవీ జస్ట్ మిస్స్ అయ్యింది. ఇకపై కూడా ఇద్దరు కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు లేవు.