ఇటీవల సల్మాన్ ఖాన్.. రష్మిక జతకట్టిన సికిందర్ సినిమాకు ముందు వినిపించిన ట్రోల్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. సీనియర్ హీరోలతో ఆ యంగ్ హీరోయిన్ రొమాన్స్ ఏంటి అంటూ.. ఈయన నాన్సెన్స్ ఏంటి అంటూ.. రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. సినిమా ప్రమోషన్స్‌లో సల్మాన్ ఖాన్ దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అవును రష్మికతో చేస్తా.. ఆమె కుమార్తెతో కూడా నటిస్తా మీకేంటి ప్రాబ్లం తనకు లేని ఇబ్బంది మీకేంటి అంటూ విసుగుతల చూపించారు. అయితే సల్మాన్ ఏ కాదు.. దేశంలో అనేక భాషలకు చెందిన వయసు పైబడిన హీరోలు అందరూ కనపరుస్తున్న చిరాకుకు ప్రతిరూపం అనడంలో అతిశయోక్తి లేదు. వృద్ధాప్యానికి చెరువులో ఉన్న హీరోలు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇటీవల కాలంలో వివాదాలకు దారితీస్తుంది.
తరచూ విమర్శలకు కారణమవుతుంది. కొందరు దీనిని వృత్తిపరమైన అంశంగా కొట్టేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఇది హానికరమైన మోస పద్ధతి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. తమకన్నా బాగా తక్కువ వయసుల వారిలో రొమాంటిక్ పాత్రలో.. పెద్ద వయసున్న మగాళ్లు నటించడం ఈనాటిది కాదు. కానీ.. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగం చర్చా వేదికలు మరింతగా పెరగడంతో.. ఈ తరహా రొమాన్స్ ను నాన్సెన్స్ గా తిట్టిపోస్తున్నారు జనం. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు సైతం తమకన్నా చాలా చిన్నవారైనా అమ్మాయిలతో నటించి సక్సెస్ లు అందుకున్న వారే. కాకపోతే.. అప్పట్లో పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే పని ఇప్పుడు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగార్జునలు చేస్తుంటే మాత్రం కుర్ర హీరొయిన్ తో రొమాన్స్ మానేసి తమ వయసు ఉన్న హీరోయిన్లతో సరిపెట్టుకోమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ హీరోలు తమ కంటే కనీసం 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న యువతులతో నటించడం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. కానీ.. ప్రస్తుతం మన స్టార్ హీరోస్ అయినా మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, రవితేజ లాంటి హీరోలు మాత్రం వయసు మీద పడ్డ కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి సిగ్గు లేదా అంటూ రకరకాల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య ఇటీవల తన సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో రొమాన్స్ కు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీనికి కారణం ఇలా.. కుర్ర హీరోయిన్ల, సీనియర్ హీరోలు నటించడంతో.. హీరోయిన్ల నటన పరిమితి తగ్గిపోతుందని వారు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ హీరోలు సైతం కుర్ర హీరోయిన్లను తమ సినిమాల్లో నటింప చేసుకుంటే.. మరి సీనియర్ హీరోయిన్ల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా ఎప్పుడూ లేనంత బలంగా ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా వేదికగా సీనియర్ హీరోలు కుర్ర హీరోయిన్లతో కుమ్ముకుంటున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ ధోరణిలో మార్పులు వస్తాయో లేదో చూడాలి.