మ‌న హీరోల‌కు సిగ్గులు, శ‌రాలు ఉండ‌వ్‌.. మీకంటే అన‌న్య నాగ‌ళ్ల వేయి రెట్లు బెట‌ర్‌..!

అల్ ఐస్ ఆన్ ర‌ఫాన్ నినాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇజ్రాయిల్ బీకర దాడులకు గురైన గాజా స్ట్రిప్ లోని ఓ ప్రాంతానికి మద్దతుగా ఇండియన్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఇమేజని షేర్ చేసుకున్నారు. అది కూడా ఏఐ క్రియేటెడ్ ఇమేజ్. దీని తర్వాత హైదరాబాద్ హెచ్‌సీయూ అడవిలో జింకలు, నెమళ్లు, కుందేలు అరుపులు, కన్నీళ్లు ఏఐ క్రియేటెడ్ ఇమేజ్ లను కూడా సెలబ్రిటీలు షేర్ చేసుకుంటూ ఎడిటెడ్ వీడియోలతో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏది చేతకాని ప్రభుత్వంలో అలాగే ఉండిపోయింది. కానీ.. ఈ సో కాల్ సెలబ్రిటీలంతా.. ఒక్కరంటే ఒక్కళ్ళు కూడా పహాల్గాం పైశాచిక ఉగ్రదాడులపై స్పంది సరిగ్గా స్పందించింది లేదు. మనకు ఎక్కడో ఉన్న రాఫా మీద ఉన్న ప్రేమ.. పహ‌ల్గాం పైన మన ఇండియన్స్ సెలబ్రిటీలకు లేదు.

Ananya Nagalla Donates to Flood Relief Funds in Andhra Pradesh and Telangana

ఈ క్రమంలోనే వాళ్లను అభిమానించే, పూజించే, కీర్తించే ఫ్యాన్స్ అంతా బేకారిగాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ సో కాల్ స్టార్ హీరోలంతా ఆమెను చూసి నేర్చుకోవాలి అంటూ.. అనన్య నాగళ్ళ‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ తెలుగు సోయగం ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా.. సామాజిక స్పృహతో ఉంటుంది. ఈ క్రమంలోనే అనన్య నాగళ్ళు తాజాగా ఓ ఈవెంట్ కోసం నెల్లూరు వెళ్లి పహల్గాం గ్రామంలో ఉగ్రదాడిలా మరణించిన ఓ వ్యక్తి ది పక్కనే ఉన్న కావలి అని తెలియడంతో.. వెంటనే అక్కడికి వెళ్లి అతనికి నివాళులు అర్పించింది. ఈ క్రమంలోనే వందలు వేల కోట్లు సంపాదించి మన సొసైటీ మీద కించంత కన్సన్ కూడా లేకుండా.. తోపులు, తురుములు అంటూ తిరుగుతున్న స్టార్ హీరోలు, వాళ్ళ ఫ్యాన్స్ తలదించుకోవాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లలో పర్మిషన్ లేకుండా వెళ్లి.. తొక్కిసలాటలకు కారణమైన హీరోలు.. సరోగెట్ యాడ్స్, బ్యాటింగ్ యాప్స్ అంటూ జనాల జేబులు కత్తిరిస్తూ బతికే హీరోలు సిగ్గుపడాలని.. సొసైటీలో మనుషులుగా పుట్టినందుకు కనీస స్పృహ కలిగి ఉండాలంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ విమర్శలు అన్నింటికి స్పందించిన చిరు లాంటి ప‌లువురు హీరోలు, హీరోయిన్లు మాత్రం మినహాయింపు. ఇక అనన్య నాగళ్ళ.. విజయవాడ మునిగిపోయినప్పుడు, కాశ్మీర్ దాడుల్లో తెలుగు వాళ్ళు, ఉగ్రవాదుల చేతుల్లో మరణించినప్పుడు రియాక్ట్ అవుతూ ఎంతో ఎమోషనల్ అయింది. తెలుగులో స్పందించింది. వారికి తోచిన సహాయం కూడా అందించేందుకు ప్రయత్నించింది. కానీ.. అలాంటి హీరోయిన్ లకు మాత్రం ఛౄన్స్‌లు ఇవ్వడానికి మన వాళ్ళు ముందుకు రారు. అమెరికాలో ఉండే ఓ పాకిస్తానీ మిలిటరీ లింకుల.. కరాచీ లేడీ ఇమ్రాన్ ఇస్మాయిల్ కి మాత్రం పల్లకి మోస్తూ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా నిలుస్తూ లేకీ గుణాన్ని ప్రదర్శిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి కారణాలతో ఈ స్టార్ హీరోలను అందరిని ఎత్తిచూపి విమర్శలు కురిపిస్తారని.. ఆమె కెరీర్ ను నాశనం చేసి కక్షకట్టకండి అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.