టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా ఎదిగే ప్రయత్నాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిగా కోర్ట్ సినిమాలో లాయర్ పాత్రలో నటించి ఎంతో మందితో ప్రశంసలు దక్కించుకున్నాడు ప్రియదర్శి. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత.. తాజాగా సారంగపాణి జాతకం సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించాడు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే కోర్టు మూవీలో ప్రియదర్శి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు సైతం ప్రియదర్శిపై ప్రశంసల వర్షం కురిపించారు. అలా కోలీవుడ్ స్టార్ కప్పుల్ అయిన హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికల జంట కూడా ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించారు. ప్రియదర్శికి ఓ స్పెషల్ ఫ్లవర్ బొకేతో పాటు.. చిన్న లెటర్‌ను కూడా గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
ఈ విషయాన్ని తన పోస్ట్ ద్వారా అందరితో షేర్ చేసుకున్న ప్రియదర్శి.. మీరు పంపిన బొకేతో సందేశాన్ని అందుకోవడం నా హృదయానికి తాకిందని.. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంటూ చెప్పుకొచ్చాడు. ఇద్దరు న్యాయవాదులు చంద్రు, వెంబ వెనుక నుంచి గర్భంగా తట్టినట్లు అనిపించిందని.. నన్ను బాగా ప్రేరేపించిన ఈ జంటకు చాలా ధన్యవాదాలు అంటూ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. కాగా.. కోర్ట్ మూవీలో జూనియర్ లాయర్ సూర్య.. తేజ పాత్రలో ప్రియదర్శిని మెప్పించాడు.