అఖండ 2 లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రంబోలే.. !

నందమూరి నట‌సింహం బాలయ్య‌ పేరు చెప్తే ఫ్యాన్స్ లో గూస్‌బంప్స్‌ మొదలైపోతాయి. గాడ్ ఆఫ్ మసెస్‌గా యాక్షన్ సినిమాలతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న బాలయ్య.. ఇటీవల వరుస సక్సెస్‌లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆరుపదల వయసులోనూ ఇప్పటికీ తన సినిమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న బాలయ్య.. తన నటనకు గాను ఎన్నో అవార్డులను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నటిస్తున్న తాజా మూవీ అఖండ 2. బోయపాటి డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Nandamuri Balakrishna, Urvashi's Dabidi Dibidi slammed for 'vulgar'  choreography

అంతేకాదు.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న క్ర‌మంలో ఇప్పటికే అఖండ 2పై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో హీరోయిన్గా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో సంయుక్త మీనన్ మెర‌వ‌నుంది. ఇలాంటి క్రమంలో ఈ ఇద్దరితో పాటే మరో ముద్దుగుమ్మ కూడా సినిమాలో హీరోయిన్గా నటించబోతుందంటూ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది. ఆమె మరెవ‌రో కాదు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల. ఈ అమ్మ‌డు అఖండ 2లో స్పెషల్ పాత్ర ఉందని.. అంతేకాదు ఓ స్పెషల్ సాంగ్ లోను ఈ అమ్మడు మెరువనుందని టాక్ వైరల్‌గా మారుతుంది.

Nandamuri Balakrishna's 'Akhanda' streams on OTT, wins hearts of netizens

ఇక ఇప్పటికే ఆ పాత్ర కోసం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈమెతో షూటింగ్ న‌న్నివేశాలను కూడా ప్లాన్ చేయనున్నారట‌ డైరెక్టర్ బోయపాటి. ఒక ఊర్వశి, బాలయ్య‌ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయని ఇండ‌స్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాను దసరా కానుక సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు త్వరలోనే రివిల్ చేయనున్నారు టీం. ఇక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కానున్న ఈ సినిమా ఆడియన్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.