టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించిన హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ఇండస్ట్రీలో మొదటి అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టిన నాని.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న క్రమంలో అష్టా చమ్మా సినిమాలో హీరోగా అవకాశాన్ని దక్కించుకొన్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తర్వాత వెనకుతిరిగి చూసుకోకుండా వర్ష సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా హీరో గానే కాదు.. నిర్మాతగాను మారి సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే.
అలా తాజాగా.. నాని నటించిన మూవీ హిట్ 3. త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే నానికి సంబంధించిన ఆస్తుల వివరాలు, రెమ్యూనరేషన్ లెక్కలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటివరకు సినీ కెరీర్‌లో నాని ఎన్ని కోట్లను కూడబెట్టాడు తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక తన మొదటి సినిమా కోసం రూ.4 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న నాని.. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం.
సొంత బ్యానర్ వాల్ పోస్టర్ ద్వారా అద్భుతమైన సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ భారీ లాభాలు అందుకుంటున్న నాని.. పలు బ్రాంచ్‌లకు అంబాసిడర్‌గాను వ్యవహరిస్తూ కోట్లల్లో కూడబెడుతున్నాడు. ఇలా.. పలు నివేదికల ప్రకారం ప్రస్తుతం నాన్ని నికర ఆస్తుల విలువే దాదాపు రూ.300 కోట్లకు పైగా ఉంటుందని టాక్. ఇక నాని వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్లు కూడా ఉన్నాయట. ఈ కార్ల విలువ కూడా చాలా ఎక్కువేనన్ని తెలుస్తుంది.