తెలుగు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న చరణ్.. తన నటనతో తండ్రికి మించిన తనయుడు గా రాణిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే చరణ్ నుంచి వస్తున్న ప్రతి సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లో అంచనాలు నెలకొంటున్నాయి. కచ్చితంగా ఫ్యూచర్ సినిమాలతో రికార్డులు కొల్లగొడతాడని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రస్తుతం చరన్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ అందుకొని ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాలని లక్ష్యంతో కష్టపడుతున్నాడు చరణ్.
ఇక సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో వేచి చూడాలి. ఇక ఈ సినిమాతో చరణ్ తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేయనున్నాడని.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు ఖయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ నందమూరి మూడో తరం హీరో ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ఏ రేంజ్ లో సక్సెస్ లతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడో చూస్తూనే ఉన్నాం. చివరిగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన తాజాగా వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనన్నాడు తారక్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇప్పటికే సినిమా సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే ఇలాంటి క్రమంలో చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది.
మొదటి నుంచి చరణ్, తారక్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించ క్రమంలో.. వీరి మధ్య బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయింది. ఇద్దరు ఒకరితో ఒకరు గట్టి పోటీ ఇస్తూ తమని తాము స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడంలో సక్సెస్ సాధించారు. ఇలాంటి క్రమంలోనే చరణ్ నటించాల్సిన ఓ సినిమాలో ఎన్టీఆర్ నటించి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన జనతా గ్యారేజ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు అందడమే కాదు.. సినిమా మంచి సోషల్ ఓరియెంటెడ్ మెసేజ్ తో వచ్చి ఆడియన్స్ను ఆకట్టుకుంది. కాగా మొదట ఈ సినిమాని చరణ్‌తో చేయాలని భావించారట. కానీ.. అనుకొని కారణాలతో ఈ కాంబినేషన్ మిస్సయింది. దీంతో తారక్‌తో కొరటాల ఈ సినిమాను రూపొందించి సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు.