తార‌క్‌ – నీల్ మూవీ కొత్త‌ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఇక‌ థియేట‌ర్లు బ్లాస్ట్‌ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ డ్రామగా రూపొ్దుతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. 2026 జూన్ 25న తార‌క్ – నీల్‌ సినిమా రిలీజ్ కానుందంటూ వివరించింది. మొదట అనుకున్న స్కేడ్యుల్ ప్రకారమే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాల‌ని టీం భావించినా స్టోరీ డిమాండ్ దృష్ట్యా.. షూట్ పూర్త‌వ‌డానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉందట‌.

NTR-Neel: Makers announce Dragon's new release date

అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం ఆలస్యం అయ్యేలా కనిపిస్తుండడంతో.. సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు టీం. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ టేకింగ్ ఏంటో ఇప్పటికే ఆడియన్స్‌లో ప్రూఫ్ అయింది. ఈ క్రమంలోనే తారక్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాపై కూడా ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. అంతేకాదు.. ప్రశాంత్ నీల్‌ కూడా ఆడియో సాంగ్స్‌కు తగ్గట్టుగానే సినిమాను మేకింగ్ విషయంలో అసలు రాజీ పడకుండా డిజైన్ చేస్తున్నాడట.

Jr NTR To Begin Shooting For Prashanth Neel's NTRNeel In Karnataka

దీంతో సినిమా రిలీజ్‌కు కాస్త ఆలస్యమైనా అభిమానులు కోరుకునే అవుట్‌పుట్ ఇవ్వాలని భావించిన ప్రశాంత్ నీల్‌.. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించినట్లు సమాచారం. ఇక ఇటీవల్ల తారక్‌తో ఈ సినిమా షూట్ ప్రారంభమై కొన్ని సన్నివేశాలు కూడా పూర్తయ్యాయి. మే 20న తార‌క్‌ బర్త్డే సందర్భంగా సినిమా స్పెషల్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేయనట్టు మేకర్స్‌ పోస్ట్‌లో వెల్లడించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం తార‌క్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారిన తారక్ లుక్స్ ఇప్పటికే వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తారక్ కు నీల్‌ ఈ సినిమాతో ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటాడో వేచి చూడాలి.