రూ. 7.75 లక్షలతో ఫ్యాన్సీ నెంబర్.. బాలయ్య అసలు తగ్గట్లేదుగా..!

నందమూరి నట‌సింహం బాలయ్య పేరు వింటే ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలవుతాయి అనడంలో సందేహం లేదు. ఆయన సినిమా ఫస్ట్ షో వ‌స్తుందంటే చాలు థియేటర్లలో ఏ రేంజ్‌లో సందడి ఉంటుందో అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం బాలయ్యకు మహర్దశ నడుస్తుంది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య.. టాక్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు. కాగా.. ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి.

Balakrishna Invests Big Money For No 1

ఇలాంటి క్రమంలోనే బాలయ్య కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరల్ గా మారుతుంది. ఓ పక్క సినిమాలతో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న బాలయ్య.. కార్ ఫ్యాన్సీ నెంబర్ విష‌యంలోను ఇదే జోరు చూపించారు. ప్రస్తుతం ఆ ఫ్యాన్సీ నెం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తెలంగాణలో.. కార్లు, బైకులకు ఫ్యాన్సీ నెంబర్ల ట్రెండ్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సహా ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఆర్డిఏ ఆఫీసులో నిన్ను ఒక్కరోజే రూ.3.71 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇక స్టార్ హీరో, ఎమ్మెల్యే బాలయ్య తన కొత్త కార్ టీజీ 09 ఎఫ్ 0001 ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ.7.7.5 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. కేవలం ఒక్క ఫ్యాన్సీ నెంబర్ కోసమే బాలయ్య ఈ రేంజ్ లో ఖర్చు చేశాడన్న న్యూస్ బ‌య‌ట‌కు రావ‌డంతో బాలయ్య ఫ్యాన్స్ దీన్ని తెగ ట్రెండ్‌ చేస్తూ.. మా బాలయ్య అసలు తగ్గేదేలే అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.