పవన్ వద్దంటూ మూడుసార్లు రిజెక్ట్ చేసి.. ఫైనల్ గా బ్లాక్ బస్టర్ స్టోరీ ఇదే..!

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదల, శ్ర‌మ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే.. ఆయన మాట పైనే స్టిక్ అయిపోయ్యి ఉంటాడు. అది సినిమాలకు సంబంధించినదైనా.. మరే విషయం అయినా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అసలు ఇష్టపడరట. అలాంటి పవన్ ఓ సినిమా విషయంలో తన డిసిషన్లు మార్చుకున్నాడని.. ఒకటి కాదు, రెండు కాదు, మూడుసార్లు రిజెక్ట్ చేసిన అదే కథకు.. నాలుగోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పవన్ ఆ సినిమాలో నటించాడని.. సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడంటూ న్యూస్ వైర‌ల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో అన్నిసార్లు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

ఆ సినిమా ఏంటంటే.. పవన్ అభిమానులకే కాదు.. సాధర‌ణ‌ ఆడియన్స్‌ను ఎంతో మందిని ఆకట్టుకున్న వకీల్ సాబ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కాగా.. లేడీస్ కు సపోర్ట్ చేస్తూ స్ట్రాంగ్‌గా నిలబడిన వకీల్ రోల్ లో పవన్ కళ్యాణ్ అదరగొట్టేసారు. ఈ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇక ఇప్పటికీ ఈ సినిమాలో చాలామంది ఆడియన్స్ టీవీల్లో వచ్చిన ఇష్టంగా చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో చేసిన సన్నివేశాలు ఎన్నిసార్లు చూసినా గూస్ బంప్స్‌ తెప్పిస్తాయి. ఈ క్రమంలోనే.. సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయిన ఆడియన్స్‌.. సినిమాను బ్లాక్ బ‌స్టర్‌గా నిలిపారు.

Vakeel Saab, On Amazon Prime Video: Pawan Kalyan In Saviour Mode

అయితే.. ఈ సినిమాని పవన్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసాడట. అప్పటికే పొలిటికల్ పనిలో బిజీగా ఉన్న పవన్.. సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపలేదట. కానీ.. ఆ రోల్‌కు ఆయన అయితేనే సూట్ అవుతారని.. మరెవరు నటించిన అంతగా సెట్ కాదు అనే ఉద్దేశంతో డైరెక్టర్.. పవన్‌ను వదలకుండా పదేపదే రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడట. ఫైనల్లీ ఆ రోల్‌ను పవన్ ఒప్పుకుని.. సినిమా పూర్తి చేశాడు. సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పవన్ కెరీర్‌లో ఇప్పటి వరకు వ‌చ్చిన‌ అన్ని సినిమాల్లో ఇది ఎంతో స్పెషల్ గా నిలిచిపోయింది.