టాలీవుడ్ హీరో నితిన్ ఒకప్పుడు వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. జయం, దిల్ లాంటి హిట్ సినిమాలతో సంచలనాన్ని సృష్టించిన నితిన్.. తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొని ఎంతో సతమతమయ్యాడు. ఇక పదేళ్ల గ్యాప్ తర్వాత ఇష్క్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చిన నితిన్.. కెరీర్ ప్రారంభం నుంచి టాప్ దర్శకల సినిమాలోనే నటించాడు. తన మొదటి సినిమా జయం ఆ సినిమాకు డైరెక్టర్ తేజ. అప్పట్లో ఆయన టాప్ దర్శకుడు. తర్వాత రాఘవేంద్రరావు, రాజమౌళి, త్రివిక్రమ్, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ అల్లా అప్పటి టాప్ డైరెక్టర్లు అందరితోను వరుసగా సినిమాల్లో నటించి సక్సెస్‌లు అందుకున్నాడు.
అయినా ఇప్పటికీ నితిన్ కెరీర్లో ఒడిదుడుకులు తప్పడం లేదు. కెరీర్ ముందుకు సాగడం లేదు. ఇప్పటికీ ఒక్క హిట్ పడితే నాలుగు ఫ్లాప్‌లు అన్నట్టుగా నితిన్ కెరీర్ డౌన్ అవుతూనే ఉంది. అయినా నితిన్ మాత్రం స్ట్రాంగ్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇలాంటి క్రమంలోనే నితిన్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించిన ఓ కుర్రాడు ప్రస్తుతం రూ.100 కోట్ల పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ పాన్ ఇండియా స్టార్ హీరో మరెవరో కాదు నిఖిల్. 2007లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తర్కెక్కిన హ్యాపీడేస్ సినిమాలో రాజేష్ పాత్రలో నిఖిల్ నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా నిఖిల్‌కు మంచి ఇమేజ్ను క్రియేట్ చేసి పెట్టింది. అయితే ఈ సినిమా కంటే ముందే నితిన్ నటించిన సంబరం సినిమాలో నిఖిల్ ఓ చిన్న క్యారెక్టర్ లో కనిపించాడు. తర్వాత ఆయన హీరోగా మారి ఎన్నో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లను అందుకున్నాడు. వాటిలో స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం , కార్తికేయ 2, 18 పేజెస్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు గతంలో నితిన్ సినిమాలో చిన్న క్యారెక్టర్ లో నటించిన నిఖిల్ మాత్రం.. ఇప్పటికే పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతుంటే.. మరో పక్క నితిన్ మాత్రం అదే మీడియం రేంజ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే బండ్లు ఓడలు కావడం.. ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.