టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుని ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన నటనతో సత్తా చాటుకున్న బన్నీ.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల వసూలు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 రికార్డులను సైతం పట్టాపంచలు చేసింది. ఇక.. ఈ సినిమా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చి రికార్డ్ క్రియేట్ చేసిన స్గతి తెలిసిందే. కాగా ఇప్పుడు బన్నీ మరోసారి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకునే్దుకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపాడు.
ఇప్పటివరకు ఇండియాలోనే రాని సరికొత్త సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో.. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నా ఈ సినిమా.. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. హైలీ టెక్నికల్ వాల్యూస్ తో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రూ.2000 కోట్లను బన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మూవీ ని కూడా భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో నెక్స్ట్ మూవీ ఉండనుంది.. ఈ సినిమా మైథలాజికల్ జార్నర్‌లో భారీ బడ్జెట్ తో ఇండియన్ సినిమానే షేక్ చూసేలా.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో హాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేలా డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగతో మరో మూవీ చేయనున్నాడు. కాగా.. ఈ సినిమాల మ్యాటర్‌లో బన్నీ ప్లానింగ్ వెనుక రాజమౌళి ఉన్నాడని టాక్.
బన్నీ సినిమాల ప్లానింగ్ కి రాజమౌళి కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. అదే బన్నీ లో జక్కనపై ఉన్న కసి. మగధీర టైంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి, రాజమౌళికి చిన్న పాటీ డిఫరెన్సెస్ వచ్చాయట. ఆ టైంలో రాజమౌళి హర్ట్ అయ్యి బన్నీతో సినిమా చేయకూడదు అని ఫిక్స్ అయ్యాడట. దీంతో అప్పుడే బన్నీ కూడా రాజమౌళితో సినిమా చేయకుండానే ఆయన రికార్డులన్నీ పటాపంచలు చేయాలని తానేంటో నిరూపించుకోవాలని భావించాడట. ఆ ప్లాన్ లో భాగంగానే ఆయన ముందుకు వెళ్తున్నాడని.. తాను కూడా రాజమౌళితో సినిమా చేయకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. సోలాగానే తాను ఇంటర్నేషనల్ నటుడిగా ఎదగాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. అయితే బన్నీ చేస్తున్న ఈ ప్లానింగ్ ఇప్పటిది కాదని.. దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచే తన ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి బన్నీ పక్కా ప్లానింగ్ చేసుకున్నాడని.. ఆ ప్లానింగ్ ని అనుసరిస్తూ ఇప్పటికే బన్నీ అనుకున్న టార్గెట్ ను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాడు.