ఆ హీరోయిన్ విష‌యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. మ్యాట‌ర్ ఏంటంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. ప్రస్తుతం పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా.. తిరుగులేని ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్‌కు సోషల్ మీడియా వేదికగా లెక్క‌లేన‌ని ఫ్యాన్ పేజీలు పుట్టుకొస్తున్నాయి. కాగా తాజాగా ఈ ఫ్యాన్ పేజీల నుంచి ప్ర‌భాస్‌కు కొత్త డిమాండ్ మొద‌లైంది. అది కూడా ఓ హీరోయిన్ మ్యాట‌ర్‌లో.. ప్రబాస్ త‌న నెక్స్ట్ మూవీ ఆ హీరోయిన్‌తోనే చేయాలని చెప్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగ‌ర్వాల్‌. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ పేజీ అంత కాజల్ నామస్మరణ మొదలుపెట్టారు.

Darling: Cast, Crew, Movie Review, Release Date, Teaser, Trailer - Filmy  Focus

తమ హీరో కాజల్తో సినిమా చేయాలని.. నెక్స్ట్ సినిమాలో వీళ్లిద్ద‌రూ కలిసి రొమాన్స్ చేస్తే చూడాలని ఉందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సడన్ గా ఈ పేరు వాళ్లకు గుర్తు రావడానికి కారణం గతంలో ప్రభాస్, కాజల్ కలిసి నటించిన డార్లింగ్ మూవీ సినిమా. తాజాగా ఈ మూవీ రిలీజై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు దీనిని గుర్తు చేసుకుంటూ.. మినీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. పనిలో పనిగా మరోసారి కాజల్, ప్రభాస్ కాంబినేషన్ వస్తే బాగుంటుందని.. ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాలో కాజల్ హీరోయిన్గా పెట్టి సినిమా చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.

Actress Kajal Aggarwal | Actor Prabhas | Dating - Filmibeat

అయితే ఏ హీరోయిన్ విషయంలోనూ లేని స్పెషల్ డిమాండ్ కాజల్ విషయంలోనే ఉండడానికి కారణం వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ. దీంతో వీరిద్దరికీ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అంతేకాదు.. ఈ జంట కొంతకాలం డేటింగ్ చేశారంటూ కూడా గ‌తంలో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రిపీట్ అయితే బాగుంటుందంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఇక్కడ అసలు సిసలు సమస్య మార్కెట్ లెక్కలు. కాజల్ ప్రస్తుతం ఫెడ్ అవుట్ దశలో ఉంది. ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలో ప్రభాస్‌ను హీరోయిన్‌గా తీసుకుని సినిమా చేయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్న.. మరో పక్క ప్రభాస్ తలుచుకుంటే అది పెద్ద మేటర్ కాదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.