పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక మొదట పవన్.. రేణు దేశాయిని బద్రి సినిమా టైంలో కలిశారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే తాజాగా.. రేణు ..బద్రి సినిమాకు ముందు జరిగిన ఓ సంఘటన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. మొదట తనకు సినిమాల్లోకి రావాలని ఆలోచన లేదని.. మోడలింగ్ చేశానని.. ముంబైలో మోడలింగ్ చేస్తున్న క్రమంలోనే నా ఫోటోలు మేనేజర్ల ద్వారా సర్క్యులేట్ అయ్యి పూరి జగన్నాథ్ వరకు వెళ్లాయని చెప్పుకొచ్చింది.
పూరి ఆ ఫొటోస్ చూసిన వెంటనే తన మొదటి సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఆయన ఫస్ట్ సినిమా ఓకే అయింది. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హీరోయిన్స్ సెలక్షన్ కోసం ఫోటో పట్టుకుని పూరి ముంబైకి వచ్చేసారు. అప్పుడే నా కాంటాక్ట్స్ సంపాదించి నాకు ఫోన్ చేశారని.. నేను మొదట నో చెప్పేశా. అంతేకాదు.. నాకు సినిమాలు చేయడం ఇష్టం లేదని చెప్పినా కూడా.. పూరి వదలలేదని చాలామందితో ఆయన చెప్పించాడని వివరించింది. మంచి కథ, హీరో కూడా స్టార్ హీరో. చాలా పాపులర్ అని ఆయన వివరించాడట. అయితే పవన్ కళ్యాణ్ ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఒకసారి ఆయన్ని చూడాలని రేణు దేశాయ్ అందట.
తెలుగులో అప్పటి వరకు తనకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ పేర్లు తెలుసు కానీ.. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని.. చిరంజీవి తమ్ముడు తొలిప్రేమతో పెద్ద హిట్ కొట్టిన ఆయన అని చెప్పడంతో.. ఆయన నేను చూడాలి అని రేణుదేశాయ్ అందట. అలా హైదరాబాద్ వచ్చి రామానాయుడు స్టూడియోస్ లో పవన్‌ను చూశానని చిరంజీవి తమ్ముడు అంటే పెద్ద రేంజ్.. హడావిడి.. బందోబస్తుంటుందని నేను అనుకున్నా. కానీ.. పవన్ అప్పటికే వచ్చి సోఫాలో కూర్చున్నారు. చాలా సింపుల్ గా కనిపించాడు. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయా. తర్వాత తాను ఆ ప్రాజెక్టుకి ఒకే చెపా అని రేణు దేశాయ్ వివరించింది. అలా రేణు బద్రి సినిమాలో.. అదే టైంలో పవన్ కళ్యాణ్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ టైంలో ఇద్దరు ప్రేమలో పడి చాలా కాలం లివింగ్ రిలేషన్ షిప్‌లోనే ఉన్నారు. ఆకిరా నందన్ పుట్టిన తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. తర్వాత కూతురు ఆధ్యాకు జన్మనిచ్చారు. ఇక కూతురు పుట్టిన రెండేళ్లకే రేణు దేశాయ్, పవన్ డివోర్స్ తీసుకున్నారు.