టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే.. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసి ఈ అమ్మడు తర్వాత మెల్లమెల్లగా వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇండస్ట్రీలోనే అడ్రస్ లేకుండా పోయింది. ఇండస్ట్రీలో హీరోయిన్లుగా సక్సెస్ అయ్యి.. ఆ సక్సెస్ను నిలుపుకోవాలంటే అందం, అభినయంతో పాటు.. లక్ కూడా కలిసి రావాలి అనడానికి ఆమె బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ ని తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస ప్లాప్‌లు ఎదురవటంతో మెల్లమెల్లగా ఫీడ్ అవుట్ దశకు చేరుకుంది. ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసింది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ.. తెరపై కనిపించే ప్రయత్నాలు చేస్తుంది.
అలా తాజాగా సూర్యతో రెట్రో సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంటూ వస్తుంది. ఇలాంటి క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీని మళ్లీ టచ్ చేసింది బుట్ట బొమ్మ. ఈ ఈ క్రమంలోనే పాత బంధాన్ని కొత్తగా అల్లుకోవడానికి ప్లాన్ చేసినట్లు టాక్ వైరల్ గా మారుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోతో పూజ హెగ్డే గతంలో ప్రేమాయణం నడిపిందని.. ఎంతలా అంటే సొంత ఫ్యామిలీ ఫంక్షన్ కి కూడా అతన్ని ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసుకునేది.. అంతలా వీళ్ళ బాండ్ ఉండేదని.. అయితే సడన్ గా ఈమెకి అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదురవడంతో.. పూజ హెగ్డేను ఆ హీరో వదిలేసాడంటూ అప్పట్లో టాక్ కూడా వైరల్ గా మారింది.
కాగా.. మొదట్లో ఏ టాలీవుడ్ హీరో అయితే ఆమెను అవాయిడ్ చేస్తూ వచ్చాడో.. ఇప్పుడు మళ్ళీ అదే హీరో, హీరోయిన్లు కలిసి కారులో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారని.. గ్యాప్ ఏర్పడిన ఈ పాత బంధమే మళ్లీ కొత్తగా.. అల్లుకుంటుందంటూ జనాలలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం పూజా హెగ్డే ఉన్న పరిస్థితుల్లో హీరోతో మరికొంత బాండింగ్ పెంచుకొని.. నాలుగైదు సినిమాల్లో అవకాశాలు దక్కించుకునేలా ప్లాన్ చేసుకుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పూజ హెగ్డే ఫ్యూచర్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.. ఆమె లైఫ్ ఎలా ఛేంజ్ అవుతుందో చూడాలి.