టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఓ ప్రాజెక్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. జవాన్ తర్వాత అట్లీ రూపొందిస్తున్న ఈ సినిమా పూర్తిగా ఒక కొత్త ప్రయోగం అని.. మాస్ యాక్షన్ ఎమోషన్స్ తో పాటు విభిన్నమైన స్క్రీన్ ప్లే తో సినిమా తెరకెక్కనుందని టాక్. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నారు టీం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ గ్లింప్స్ వీడియోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన స్టైలిష్ అనౌన్స్మెంట్ వీడియో అందరినీ మెప్పించింది. బన్నీ ఫ్యాన్సే కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుందని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఓవైపు పాన్ వరల్డ్ రేంజ లో దీన్ని ఎందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. మరోవైపు ఈ ప్రాజెక్టుపై మరిన్ని చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమాపై సరికొత్త అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఈ ప్రాజెక్టును 2026 డిసెంబర్ కు రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజేషన్, కాస్టింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి.. వీలైనంత త్వరగా షూట్ ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించి.. వరల్డ్ క్లాసు విజువల్స్ తో సినిమాను రిలీజ్ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇక సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించి మరి.. హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను దింపుకునట్లు సమాచారం. ఇక బన్నీ సరసన హీరోయిన్లుగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ల ప్రియాంక చోప్రా ఒకటి కాగా.. మరోవైపు సమంత పేరు కూడా వినిపిస్తోంది. కాగా.. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే భార్యా అంచనాలతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో.. ఆడియన్స్‌ను అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.