నా కొడుకుతో ఓ సినిమా చేయమని రాజమౌళి ని రిక్వెస్ట్ చేసిన సీనియర్ స్టార్ హీరో.. ఎవరంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. నేషనల్ లెవెల్‌లో ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తెర‌కెక్కించబోయే ప్రతి సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా నటించే అవకాశం వస్తే బాగుండ‌ని.. స్టార్ హీరోని సైతం భావిస్తున్నారు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో ఛాన్స్ వస్తే అసలు మిస్ కావడం లేదు. అలా మన టాలీవుడ్‌లో కూడా స్టార్డంలేని హీరోలు రాజమౌళి చేతిలో పడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఇండస్ట్రీలో హిట్ కొట్టలేక సతమతమవుతున్న తన కొడుకుతో జక్కన్న ఒక్క సినిమా చేయాలని తెగ ప్రయత్నాలు చేశాడ‌ట‌. ఇంతకీ ఆయన ఎవరో కాదు సీనియర్ హీరో మోహన్ బాబు.

I could have lost my eye sight that day: Mohan Babu

అవును.. మోహన్ బాబు సినిమా చేయాలని రాజమౌళిని చాలాసార్లు అడిగాడట. రాజమౌళి డైరెక్ట్ చేసిన య‌మ దొంగా సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యముడిగా ఆయన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ టైంలో మోహన్ బాబు.. రాజమౌళిని ఎన్నోసార్లు ఈ విషయంపై కదిలించాడట. విష్ణు సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ చెప్పు అని అడిగేవాడట. ఇక రాజమౌళి ఆ టైంలో చేస్తానని చెప్పిన కరెక్ట్ డేట్ చెప్పు అని ఒత్తిడి చేసేవాడట. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఇదే న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.

'Kannappa' 1st look out: Atheist warrior Vishnu Manchu turns Lord Shiva's  devotee

ఈ క్రమంలోనే విష్ణు హీరోగా.. రాజమౌళి డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా చేయించాలని మోహన్ బాబు ఎన్నో ప్రయత్నాలు చేశాడట. కానీ.. అవేవి వర్కౌట్ కాలేదు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్‌తో తన కొడుకు విష్ణును హీరోగా పెట్టి.. కన్నప్ప సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అన్ని భాషల నుంచి ప్రధాన తారాగణమంతా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు, టీజర్ కూడా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక రాజమౌళి.. మహేష్ సినిమాతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా రూ.1000 కోట్లు బడ్జెట్ తో పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు జక్కన్న.